రాంగోపాల్ వర్మ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మళ్లీ నోటీసులు ఇచ్చిన పోలీసులు..
మరోవైపు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది.

Ram Gopal Varma (Photo Credit : Google)
Ram Gopal Varma : డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఒంగోలు రూరల్ పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన సోషల్ మీడియా కేసులో.. రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నెల 25న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. సెక్షన్ 35 క్లాజ్ 3 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. నిన్ననే విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆర్జీవీ వెళ్లలేదు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నానని, వారం రోజుల గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలని పోలీసులు మళ్లీ నోటీసులు పంపించారు.
మరోవైపు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వర్మ అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్ట్ పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో వర్మ తరుపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
రాంగోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎంక్వైరీకి రావాల్సిందేనని పోలీసులు వర్మకు తేల్చి చెప్పారు. నెక్ట్స్ ఏం జరగనుంది? వర్మ విచారణకు హాజరవుతారా లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పోలీసుల నోటీసులపై వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కచ్చితంగా విచారణకు హాజరవుతారా? లేక మరోసారి దీన్ని పెండింగ్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అనేది ఆసక్తి రేపుతోంది.
అటు హైకోర్టును ఆశ్రయించినా.. వర్మకు నిరాశే ఎదురైంది. మీకు ఎలాంటి రక్షణ కల్పించలేము అని కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టు వ్యవహారంలో కచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని, వివరణ ఇవ్వాల్సిందేనని హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వర్మ కచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read : బాబోయ్.. లాకర్లలో ఉంచిన రూ.13కోట్ల విలువైన బంగారం చోరీ.. రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో దొంగల బీభత్సం..