Padmasree Sunkara: బీజేపీ వాళ్లు దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తారట.. సిగ్గుండాలి: ఏపీసీసీ ఆగ్రహం

ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టిని సేకరిస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Padmasree Sunkara: బీజేపీ వాళ్లు దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తారట.. సిగ్గుండాలి: ఏపీసీసీ ఆగ్రహం

Daggubati Purandeswari, Padmasree Sunkara

Updated On : September 1, 2023 / 6:12 PM IST

Padmasree Sunkara – APCC: దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తామని బీజేపీ (BJP) చెబుతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ విమర్శించారు. విజయవాడ(Vijayawada)లో ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అమృతోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల నుంచి బీజేపీ మట్టి సేకరిస్తున్న కార్యక్రమం గురించి ప్రస్తావించారు.

ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టిని సేకరిస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ నా భూమి.. నా దేశం ’ పేరుతో బీజేపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపిందని అన్నారు. ప్రధాని మోదీ ఏపీ ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా మోసం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు.

ఇలాంటి చెత్త కార్యక్రమాలకు పురందేశ్వరి సహకరించడం అవసరమా అని నిలదీశారు. జనాల మనోభావాలతో బీజేపీ ఆడుకుంటోందని విమర్శించారు. ఆ పార్టీ నేతలకు సిగ్గులేదా అని నిలదీశారు. ఇప్పటికే ఏపీకి మట్టి, నీరు తీసుకొచ్చి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతిని సర్వ నాశనం చేశారని చెప్పారు.

మళ్లీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మట్టి సేకరించే కార్యక్రమం ఏంటని ప్రశ్నించారు. దేశ ప్రజల నోట్లోనూ మట్టి కొట్టాలని చూస్తున్నారా? అని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఖ్యాతిని పెంచి మనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అమరావతిని సర్వ నాశనం చేశారని ఆయను బీజేపీ అధిష్ఠానం ఏమీ అనడం లేదని అన్నారు. అమరావతి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని చెప్పారు.

YCP: విజయసాయిరెడ్డి మాయాజాలంపైనే ఒంగోలు వైసీపీ భవిష్యత్.. ఏం చేస్తారో?