NIA: ఇండియన్ నేవీలో గూఢచర్యం కేసు.. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఛార్జిషీటు ధాఖలు
విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈఏసీగా పనిచేస్తున్న ఆకాశ్ సోలంకి నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన..

NIA charge sheet
NIA – Pakistan: ఇండియన్ నేవీలో గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇవాళ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విజయవాడ (Vijayawada) ఎన్ఐఏ కోర్టులో ఛార్జిషీటు ధాఖలు చేసింది. పాకిస్థాన్ జాతీయుడితో పాటు మరొకరిపై అభియోగాల నమోదు చేసింది.
విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈఏసీగా పనిచేస్తున్న ఆకాశ్ సోలంకి నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని నెలల క్రితం అతడిపై కేసు నమోదైంది.
అదితి చౌహాన్ అనే పేరుతో ఓ పాక్ జాతీయుడితో సోలంకి సంప్రదింపులు జరుపుతూ పాక్ కుట్రలో భాగస్వామి అయ్యాడు. క్రిప్టోకరెన్సీ రూపంలో పాక్ జాతీయుడి నుంచి సోలంకి నగదు అందుకున్నాడు. ఆకాశ్ సోలంకితో పాటు పాక్ జాతీయుడు మీర్ బలాజ్ ఖాన్ లపై ఛార్జిషీటు ధాఖలైంది. ఆకాశ్ సోలం, మీర్ బలాజ్ ఖాన్ పరారీలో ఉన్నారు.