AP : పాపికొండలు చూసొద్దామా, బోట్ టూర్ రెడీ

ప్రకృతి అందాలు, గోదావరి అలల మధ్య పర్యాటకులను అద్భుతమైన అనుభూతిని పంచేందుకు.. ఏపీ టూరిజం సిద్ధమైంది. 21 నెలల గ్యాప్ తర్వాత.. మళ్లీ పాపికొండల విహారయాత్ర మొదలుకాబోతోంది. జీపీఎస్, లైఫ్ జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్‌తో పాటు అన్ని రకాల భద్రతా చర్యలతో.. వాటర్‌లో బోట్ టూర్ రెడీ అయిపోయింది.

AP : పాపికొండలు చూసొద్దామా, బోట్ టూర్ రెడీ

Papikondalu

Updated On : July 2, 2021 / 8:19 AM IST

Papikondalu Tour : ప్రకృతి అందాలు, గోదావరి అలల మధ్య పర్యాటకులను అద్భుతమైన అనుభూతిని పంచేందుకు.. ఏపీ టూరిజం సిద్ధమైంది. 21 నెలల గ్యాప్ తర్వాత.. మళ్లీ పాపికొండల విహారయాత్ర మొదలుకాబోతోంది. జీపీఎస్, లైఫ్ జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్‌తో పాటు అన్ని రకాల భద్రతా చర్యలతో.. వాటర్‌లో బోట్ టూర్ రెడీ అయిపోయింది. కొండల మధ్య పారే గోదారి అందాలను టూరిస్టులను పంచేందుకు.. ఏపీ టూరిజం శాఖ పర్మిషన్ ఇచ్చేసింది. మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.

మే నెలలోనే.. గోదావరిలో బోటు ప్రయాణాలను ప్రారంభించేందుకు.. అధికారులు ఏప్రిల్ 15న ట్రయల్ రన్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో.. పాపికొండల టూరిజంకు బ్రేక్ పడింది. ఇప్పుడు.. అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకొని.. విహారయాత్ర మొదలుపెట్టామని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం ఆరు పడవలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే.. మరిన్ని బోట్లను అనుమతిస్తామన్నారు.

ప్రస్తుతం.. బోటు ప్రయాణాలను పర్యవేక్షించేలా.. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. పర్యాటకులకు లైఫ్ జాకెట్లు సమకూర్చడంతో పాటు గోదావరిలో జర్నీకి ఉన్న అనుకూల పరిస్థితులు, బోటు కండీషన్ లాంటి అంశాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. బోటు ప్రయాణాలు భద్రంగా సాగేలా.. పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి దగ్గర కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వీటికి.. 22 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.