Paritala Sunitha : ఎంతో ఎత్తు గోడలు, మరెంతో భద్రత ఉన్న జైల్లోనే మొద్దుశీనును చంపారు- చంద్రబాబు సెక్యూరిటీపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
జైలులో రకరకాల వ్యక్తులుంటారు. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలాగే చంద్రబాబుకు కూడా ఏమైనా జరుగుతుందేమోనన్న భయం ఉంది. Paritala Sunitha

Paritala Sunitha (Photo : Google)
Paritala Sunitha – Chandrababu Arrest : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే జైల్లో చంద్రబాబు భద్రతపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు సెక్యూరిటీపై భయాందోళనలు వ్యకం చేస్తున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును ఉంచడం అంత సేఫ్ కాదంటున్నారు. అక్కడ చంద్రబాబుకి ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఎత్తు గోడలు, మరెంతో భద్రత ఉన్న అనంతపురం జిల్లా జైల్లోనే మొద్దుశీనును మర్డర్ చేశారు అని పరిటాల సునీత గుర్తు చేశారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్‌పై అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు.. వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం
”మొద్దుశీనును ఎంతో భద్రత ఉన్న జిల్లా జైలులోనే చంపారు. చంద్రబాబుకు జైల్లో భద్రతపై అనుమానాలు ఉన్నాయి. అధికారులు గోడల ఎత్తు గురించి మాట్లాడుతున్నారు. అంతే ఎత్తు ఉన్న అనంతపురం జిల్లా జైలులో మొద్దుశీనును చంపారు. ఈ విషయం మర్చిపోకండి. జైల్లో రకరకాల వ్యక్తులుంటారు. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలాగే చంద్రబాబుకి కూడా ఏమైనా జరుగుతుందేమోనన్న భయం ఉంది” అని మాజీమంత్రి పరిటాల సునీత అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీపై ఏపీ ప్రజల్లో..: బండి సంజయ్
చంద్రబాబు హౌస్ రిమాండ్ కోసం వేసుకున్న పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకి ఇంట్లో కన్నా జైల్లో ఎక్కువ భద్రత ఉంటుందని, జైల్లోనే చంద్రబాబు మరింత సేఫ్ గా ఉంటారని సీఐడీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేసింది. చంద్రబాబు ఒక భద్రమైన కోటలో ఉన్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉంటున్న ప్రాంతాన్ని జైలు అధికారులు ఒక కోటలా మార్చేశారని, ఎవరూ ఊహించని రేంజ్ లో చంద్రబాబుకి భద్రత కల్పించారని ఆయన చెప్పారు. జైల్లో చంద్రబాబు భద్రత మా ప్రభుత్వం బాధ్యత అన్నారు. చంద్రబాబు సెక్యూరిటీ గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకే టైట్ సెక్యూరిటీ కల్పించామని లాయర్ పొన్నవోలు సుధాకర్ వెల్లడించారు.