డేట్ ఫిక్స్ : 15న రాజధానికి వస్తున్నా పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు..ఆ.. ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసుకోవడం ఏంటీ..ఇప్పటికే పలు సినిమాలకు టైం కూడా కేటాయిస్తే..ఇంకా టైం దేనికి అంటారు కదా…సినిమాల్లో నటిస్తూనే..రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు జనసేనానీ. ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఆయన డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. మూడు రాజధానుల అంశం ఏపీలో కాక రేపుతున్న సంగతి తెలిసిందే కదా.
ఒక్క రాజధానే ముద్దు..మూడు రాజధానులు వద్దూ..అంటూ పవన్ నినదిస్తున్నారు. అంతేగాకుండా..ఆయన అమరావతిలో రైతులు, ప్రజలతో మాట్లాడారు. అమరావతిలో ఒకసారి పవన్ పర్యటించారు. మూడు రాజధానుల ఆందోళన ఉధృతమౌతున్న దశలో పవన్ అక్కడ పర్యటించాలని అనుకున్నా..పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు.
తాజాగా అమరావతిలో పర్యటించేందుకు డేట్ ఫిక్స్ చేశారు. 2020, ఫిబ్రవరి 15వ తేదీన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని జనసేన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటనకు సంబంధించిన ప్రణాళికను జనసేన నాయకులు సిద్ధం చేశారని పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా గాయపడిన వారు..పవన్ కలవడం జరిగిందని, మరోసారి అమరావతిలో పర్యటించాలని కోరినట్లు తెలిపారు. వారికిచ్చిన మాట ప్రకారం ఈ పర్యటన ఖరారైందన్నారు. ఈ పర్యటనకంటే ముందు…ఫిబ్రవరి 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ పర్యటన ఉంటుందన్నారు.
29 గ్రామాలు కలిపే విధంగా ఈ పర్యటన ఉండబోతోంది. రైతుల ఆందోళన 50 రోజులకు పూర్తయిందని..ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఈ ఆందోళనలను తీసుకెళుతానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా పవన్ చేసిన ప్రకటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
* రాజధాని అంశం తేల్చేదాక విడచిపెట్టనని అన్నారు పవన్.
* అమరావతి గ్రామాలకు వెళ్లారాయన. రోడ్ల మీద బైఠాయించారు.
* రెండోసారి వెళ్లిన సందర్భంలో ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందంటూ..వెనుదిరిగారు.
* అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకుని అమరావతికి వచ్చారు. రైతులకు న్యాయం చేస్తానన్నారు.
* మరి ఇప్పుడు చేసే పర్యటనలో ఎలాంటి ప్రణాళిక ఉంటుందో ? ఎలాంటి పోరాటం చేస్తారో వెయిట్ అండ్ సీ.
15న రాజధాని గ్రామాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటన pic.twitter.com/oGpE7xJiDY
— JanaSena Party (@JanaSenaParty) February 8, 2020