Kottu Satyanarayana : ప్రజల్లో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది.. చంద్రబాబు దుర్మార్గం పవన్ కళ్యాణ్ కి అర్థం కావట్లేదు : కొట్టు సత్యనారాయణ
పవన్ కళ్యాణ్ కాపులని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేశాడని పేర్కొన్నారు. ప్యాకేజీ స్టార్ అంటున్నారని ఏనాడైనా చంద్రబాబు ఖండించాడా? అని నిలదీశారు.

AP Deputy CM Kottu Satyanarayana
Kottu Satyanarayana – Chandrababu : చంద్రబాబు ఏదో చట్టానికి అతీతుడుగా, రాజ్యాంగం చంద్రబాబుకి కాదనట్లు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. తాను పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకిని కాను, బాగా నటిస్తాడని పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తానని చెప్పారు. సినిమాల్లో ఉన్న అభిమానం రాజకీయంగా చూపించాల్సిన పనిలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీ మూసివేసే వరకు చంద్రబాబు, ఈ ఎల్లో మీడియా కలిసి బయటకు వెళ్లిపోయేలా హింసించి వదిలిపెట్టారని ఆరోపించారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కొట్టు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. నాడు ప్రజారాజ్యం మూసేయడానికి కారణమైన వాళ్ళని కక్ష తీర్చుకుంటా అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇద్దరి మధ్య లావాదేవీలు, లెక్కల్లో తేడా వస్తే గుంటూరు మీటింగ్ లో లోకేష్ ని నీ సంగతి తేలుస్తా అని మండిపడ్డాడని పేర్కొన్నారు. పవర్ స్టార్ కాస్త ప్యాకేజీ స్టార్ అయ్యాడు అని ఎద్దేవా చేశారు.
Atchannaidu : ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు : అచ్చెన్నాయుడు
పవన్ కళ్యాణ్ కాపులని చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేశాడని పేర్కొన్నారు. చంద్రబాబు దుర్మార్గం పవన్ కళ్యాణ్ కి అర్థం కావట్లేదన్నారు. ప్యాకేజీ స్టార్ అంటున్నారని ఏనాడైనా చంద్రబాబు ఖండించాడా? అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉందని చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ తో వాలంటీర్ లను కించపరిచేలా చేశాడని ఆరోపించారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం తమ వల్ల కూడా కాదని బీజేపీ కూడా భావిస్తుందని తెలిపారు.
బీజేపీ, జనసేన కలిస్తే రెండో స్థానంలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావని బీజేపీ నాయకులు పవన్ కి చెప్పారని పేర్కొన్నారు. అవకాశాన్ని అందిపుచ్చికోవడం పవన్ కి తెలియదని, డబ్బు రూపేణా మాత్రమే అవకాశం చూసుకుంటున్నాడని విమర్శించారు. పవన్ వారాహి యాత్రలో అవనిగడ్డలో రెండు కథలు చెప్పాడు, రెండు లక్షల పుస్తకాలు చదివాడట అని తెలిపారు. చంద్రబాబు పవన్ ని స్క్రిప్ట్ లు రాసి చదివిస్తూ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నాడని పేర్కొన్నారు.
Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర : రేవంత్ రెడ్డి
ప్రతిపక్ష పార్టీగా అవతరించే బంగారం లాంటి అవకాశం ఎందుకు కోల్పోతున్నాడని చమత్కరించాడు. చంద్రబాబు తన కొడుకును ఢిల్లీ పంపిస్తే ఎవరు పట్టించుకోలేదన్నారు. ప్రజలిచ్చిన అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఎలా దోచుకోవాలో చంద్రబాబుకి తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. ‘నువ్వు ఇక్కడ ఉంటే లోపల వేస్తారని లోకేశ్ కు చంద్రబాబు చెప్పాడని.. అందుకే లోకేశ్ హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు’ అని ఎద్దేవా చేశారు. ఎక్కడ వారి కుంభకోణాలు బయట పడతాయోనని భయపడి పోతున్నారని తెలిపారు.