Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధి కోసం పవన్ కీలక నిర్ణయం.. సొంత నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్..
తాజాగా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సభలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు.

Pawan Kalyan taking Key Decision on his Constituency Pithapuram Development
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనలో దూసుకుపోతున్నారు. రోజూ ప్రజల్లోనే ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలని ఆయా అధికారులకు చెప్తున్నారు. ఇక తన నియోజకవర్గం పిఠాపురం పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిఠాపురంను కుదిరినప్పుడల్లా సందర్శిస్తూ అక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
ఇప్పటికే పిఠాపురంలోని పలు స్కూల్స్ కు అన్ని వసతుల ఏర్పాట్లు, తన సొంత డబ్బుతో స్థలం కొనివ్వడం.. ఇలా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసారు. తాజాగా పిఠాపురంలోని పలు గ్రామాలను సందర్శించారు. పిఠాపురంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టారు. ఇందుకు నిధులు కూడా విడుదల చేసారు. పిఠాపురంలో ఉన్న సమస్యలు అన్ని తెలుసుకొని ఆయా విభాగాల అధికారులకు సూచనలు జారీ చేసారు.
Also Read : Chetan Krishna : తెలుగు సినిమాలను పట్టించుకోవడం లేదు.. థియేటర్స్ ఇవ్వడం లేదు.. ‘ధూం ధాం’ హీరో ఎమోషనల్..
తాజాగా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సభలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం ‘పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా)’ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో పిఠాపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు. పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నందుకు బాగానే పనిచేస్తున్నారని అనుకుంటున్నారు. ఇక పవన్ కూడా తనను గెలిపించిన పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టి బాగానే డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి తన నియోజకవర్గాన్ని అందరూ మెచ్చుకునేలా చేస్తారేమో చూడాలి.