అప్పుడు 150మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటీ?: పవన్ కళ్యాణ్

గత ప్రభుత్వాన్ని కూడా ఇసుక పాలసీ విధానాల్లో మేము చాలా గట్టిగా ఎండగట్టాం అని అన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు చేసిన వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సింది పోయి, వైసీపీ వాళ్లు పూర్తిగా ఇసుకని ఆపేశారు అని అన్నారు పవన్ కళ్యాణ్. తెలుగు భాష గురించి మేము పాలసీ విధానాలను మాట్లాడుతుంటే వాళ్లు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులం ఓట్లు తగ్గిపోతాయి అని నేను ఏదైనా విమర్శలు చేయగానే కాపు కులం మంత్రులు, ఎమ్మెల్యేలతో తిట్టిస్తున్నారని అన్నారు పవన్. జగన్‌ను అనగానే కులాన్ని అన్నట్లు కాదు అన్నారు పవన్ కళ్యాణ్. నేను బయటకు వస్తే కేవలం కాపులు వచ్చి విమర్శించడం ఎందుకు అని తనను విమర్శించడానికి ఎవరైనా రావచ్చు అన్నారు పవన్ కళ్యాణ్. అడిగిన దానికి పద్దతిగా సమాధానం చెబితే బాగుంటుందని, పద్దతి తప్పి మాట్లాడితే ఎలా మాట్లాడాలో మాకు తెలుసు అని అన్నారు పవన్ కళ్యాణ్.
అలాగే 150మంది ఎమ్మెల్యేలు జగన్‌ను చూసుకుని రెచ్చిపోతున్నరు అని. కాస్త జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. పాము.. శివుడి మెడలో ఉన్నప్పుడే గౌరవిస్తాం అని జగన్ రెడ్డి పరిస్థితి అటూ ఇటు అయితే మీ పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. స్థాయి దాటితే మేము కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని అన్నారు పవన్ కళ్యాణ్.