Sankranti Sambaralu : సంక్రాంతి సంబరాల్లో.. చిరంజీవి పాటకు స్టెప్పులేసిన కలెక్టర్..
సంక్రాంతి సంబరాల్లో ఓ జిల్లా కలెక్టర్ డ్యాన్స్ వేసి వైరల్ అవుతున్నారు.

Planadu District Collector Dance for Megastar Chiranjeevi Song in Sankranti Sambaralu Video goes Viral
Sankranti Sambaralu : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలని ఘనంగా చేసుకుంటున్నారు. ఇక ఆంధ్రాలో సంక్రాంతి ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో చెప్పాల్సిన అవసరంలేదు. కుటుంబాలతో సంక్రాంతిని చేసుకోవడమే కాక సామూహికంగా పలు సంబరాలని కూడా నిర్వహిస్తారు. భోగి మంటలు, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, సాంసృతిక కార్యక్రమాలు.. ఇలా చాలానే ఏర్పాటు చేస్తారు.
ఈసారి ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లో సంక్రాంతి సంబరాలను అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ సంబరాల్లో రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. ఇటీవల ఏపీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండగ సెలబ్రేషన్స్ లో స్టెప్పులు వేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంక్రాంతి సంబరాల్లో ఓ జిల్లా కలెక్టర్ డ్యాన్స్ వేసి వైరల్ అవుతున్నారు.
Also Read : Rajasaab : భీమవరంలో ప్రభాస్ ‘రాజాసాబ్’ డిజిటల్ లాంచ్ వీడియో చూశారా?
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఆ జిల్లా కలెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు. ఈ సంబరాలకు కొంతమంది జబర్దస్త్ నటులు, సింగర్స్, డ్యాన్సర్లు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యలోని సాంగ్ ని సింగర్స్ పాడుతుండగా పలువురు డ్యాన్స్ వేస్తుండగా జిల్లా కలెక్టర్ శివశంకర్ కూడా స్టేజిపై వాళ్ళతో కలిసి స్టెప్పులు వేసి అదరగొట్టారు. దీంతో కలెక్టర్ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మెగాస్టార్ పాటకి స్టెప్పులేసిన కలెక్టర్
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకల్లో కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని పాటకి స్టెప్పులేసి అదరకొట్టాడు. pic.twitter.com/0nSmIEsYRN
— Telugu Scribe (@TeluguScribe) January 16, 2024
Sankranti celebrations day-2 at DSA Stadium, Narasaraopet pic.twitter.com/woRUmxMlVO
— Collector Palnadu (@SivasankarLoth1) January 16, 2024