ముంబై నటి కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్ట్..

ఈ కేసులో విద్యాసాగర్ ను విచారిస్తే పలు కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ముంబై నటి కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్ట్..

Updated On : September 20, 2024 / 8:25 PM IST

Kadambari Jethwani Case : ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్ లో విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే 6 బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా.. ఎట్టకేలకు విద్యాసాగర్ ఆచూకీని గుర్తించారు. ఈ కేసులో విద్యాసాగర్ ను విచారిస్తే పలు కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Also Read : వైసీపీలోకి వెళ్లి తప్పు చేశామా? కరుడుకట్టిన ఆ ఇద్దరు టీడీపీ నేతల్లో అంతర్మథనం..!

ఇటీవలే నటి జెత్వానీ హోంమంత్రి అనితను కలిశారు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. తనకు ఎదురైన పరిస్థితులు మరెవరికీ రాకూడదని ఆమె వాపోయారు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని పరిహారం కోరుతున్నట్లు పేర్కొన్నారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో సాకుతో కొందరు ఐపీఎస్ అధికారులు తనను తీవ్రంగా వేధించారని ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. తనను ఓ టెర్రరిస్టులా చూశారని అన్నారు. తన కేసును రాజకీయాలో ముడి పెట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎప్పటికైనా ఏపీ సర్కార్ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని జెత్వానీ అన్నారు. కాగా, జెత్వానీ కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై(పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ) వేటు వేసిన సంగతి తెలిసిందే.