బెంగళూరు రేవ్ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు

రేవ్ పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్లు, పార్టీకి ఎంట్రీ ఫీజు రెండు లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది

బెంగళూరు రేవ్ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు

Bangalore Rave Party Case

Bangalore Rave Party Case : బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనేకాదు.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రేవ్ పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నా కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్స్ రాకెట్ కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీలో సూత్రధారి ఇతనే..!

రేవ్ పార్టీకి మొత్తం 200 మంది హాజరైనట్లు, పార్టీకి ఎంట్రీ ఫీజు రెండు లక్షలు వసూలు చేసినట్టు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. పార్టీకి క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటినటులు, రాజకీయ నేతలు హాజర‌య్యారు. రేవ్ పార్టీ ఘ‌ట‌న‌లో ఇప్పటికే ఐదు గురిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీకి హాజరైన వారి నుండి బ్లెడ్ షాంపుల్స్ సేకరించారు. బ్లెడ్ షాంపుల్స్ రిపోర్టులు ఈరోజు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read : Bangalore Rave Party : రేవ్ పార్టీ కలకలంపై స్పందించిన కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమసైతం పాల్గొన్నట్లు చెబుతున్న పోలీసులు.. ఆమె నుంచి బ్లెడ్ షాంపుల్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నిర్వాహకుడు వాసు నేర చరిత్ర పైనా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు.