Chandrababu : ఖైదీ నెంబర్ 7691.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గది సిద్ధం

జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. జైలు చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. Chandrababu Shifted To Jail

Chandrababu : ఖైదీ నెంబర్ 7691.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గది సిద్ధం

Chandrababu Shifted To Jail

Updated On : September 11, 2023 / 1:48 AM IST

Chandrababu Shifted To Jail : స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆదివారం (సెప్టెంబర్ 10) అర్థరాత్రి ఒంటి గంట తర్వాత చంద్రబాబుని జైల్లోకి తీసుకెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఏసీబీ కోర్టు నుంచి రోడ్డు మార్గాన చంద్రబాబుని తరలించారు పోలీసులు.

భారీ వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి చేరుకోవడానికి 5గంటలకు పైగానే సమయం పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు కోసం జైల్లోని స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు అధికారులు. చంద్రబాబుకి ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు జైలు అధికారులు. జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. జైలు చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Minister Roja : జగన్ చెప్పినట్టు దేవుడు ఉన్నాడు, విధిని ఎవరూ తప్పించుకోలేరు, ఏ తప్పు చేయని జగన్‌ని అరెస్ట్ చేయించారు- చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు నారా లోకేశ్ రాజమండ్రి వెళ్లారు. చంద్రబాబు వెంట వచ్చిన వాళ్లను జైలు బయటే నిలిపివేశారు పోలీసులు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల(సెప్టెంబర్ 22వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.