Andhra Pradesh : ఏపీలో పోలీసుల నిర్లక్ష్యం .. నడిరోడ్డుపై స్టేషన్ క్రైమ్ రికార్డు బుక్

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు నిర్లక్ష్యం ఎంతగా ఉంది నడిరోడ్డుపై కనిపిస్తోంది. పోలీసు స్టేషన్ లో ఉండాల్సిన రికార్డు బుక్ నడిరోడ్డుపై పడి ఉంది. ఏదో చిత్తుకాగితంలో నడిరోడ్డుపై స్టేషన్ క్రైమ్ రికార్డు బుక్ పడి ఉండటంతో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Andhra Pradesh : ఏపీలో పోలీసుల నిర్లక్ష్యం .. నడిరోడ్డుపై స్టేషన్ క్రైమ్ రికార్డు బుక్

Police Station Crime Record Book on Road in Nandyala

Updated On : March 4, 2023 / 4:18 PM IST

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు నిర్లక్ష్యం ఎంతగా ఉంది నడిరోడ్డుపై కనిపిస్తోంది. పోలీసు స్టేషన్ లో ఉండాల్సిన రికార్డు బుక్ నడిరోడ్డుపై పడి ఉంది. ఏదో చిత్తుకాగితంలో నడిరోడ్డుపై స్టేషన్ క్రైమ్ రికార్డు బుక్ పడి ఉండటంతో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాలలో క్రైమ్ రికార్డు బుక్ కనిపించటంతో ప్రజలు పోలీసులపై మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యమా? అంటూ విమర్శిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ లో భద్రంగా ఉండాల్సి కీలక సమాచారం బుక్ నడిరోడ్డుపై పడి ఉంది. స్టేషన్లలో ఉండాల్సిన నేరాలకు సంబంధించిన సమాచారం,ఫోటోలు, యాక్సిడెంట్, ఆత్మహత్యలు, హత్యలు, నేరాలు, స్టేట్ మెంట్ రికార్డులు, కీలక పత్రాలకు సంబంధించి రికార్డు బుక్ రోడ్డుపై చిత్తు పేపర్లలా పడిఉన్నాయి. వీటిని చూస్తుంటే పోలీసుల నిర్లక్ష్యానికి ప్రత్యంగా ఉన్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భద్రంగా ఉండాల్సినవి ఇలా బహిరంగంగా ఉండటం పోలీసుల నిర్లక్ష్యం, బాద్యతారాహిత్యమేనంటున్నారు.