విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపన వాయిదా..ముఖ్యఅతిధిగా మోడీ

  • Published By: madhu ,Published On : August 11, 2020 / 11:38 AM IST
విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపన వాయిదా..ముఖ్యఅతిధిగా మోడీ

Updated On : August 11, 2020 / 12:37 PM IST

విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపనను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 16వ తేదీన శంకుస్థాపన చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..



కానీ..రాజధానుల అంశాలకు సంబంధించి..కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఆ రోజు కాకుండా..దసరా రోజున నిర్వహించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ రోజు వరకు..అన్నీ అంశాలు పరిష్కారమౌతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ శంకుస్థాపనకు ప్రత్యక్షంగా గానీ..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్..ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగ భావిస్తున్న 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా పాల్గొనాలని సీఎం జగన్ కోరనున్నారు.



ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి విశాఖకు పలు కార్యాలయాలు తరళి వెళుతాయని ప్రచారం జరిగింది. పంద్రాగస్టు వేడుకలు అక్కడే జరుగుతాయని భావించారు. ఆ రోజున..ముఖ్యమంత్రి కార్యాలయం తరలిస్తూ..లాంఛనంగా ప్రారంభిస్తారని, తర్వతా..ఒక్కో శాఖను విశాఖకు తరలించాలని భావించారు.

రాజధాని అంశంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించిన తర్వాతే…నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.
ఏపీ రాజధాని విషయంలో పొలిటికల్ హీట్ కొనసాగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

రాజధాని నిర్ణయం ఎవరి పరిధిలోకి వస్తుందనే అనే అంశంపై ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం ఆయా ప్రభుత్వాల పరిధిలో అంశమని కేంద్ర హోం శాఖ తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ…కోర్టుల్లో న్యాయసమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.



ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు ప్రతిపాదిస్తూ..రెండు చట్టాలను చేసిందనే విషయాన్ని గుర్తు చేసింది. ఆ చట్టాల ప్రకారం మూడు రాజధానులు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని వెల్లడించింది. లోక్ సభ, రాజ్యసభలు తీర్మానానికి ఆమోదం తెలిపిన అనంతరం..రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే..మూడు రాజధానులు అధికారికంగా నిర్ధారణ అవుతుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో..తీర్మానానికి పచ్చజెండా ఊపుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది.