Pawan Kalyan : ఆవిర్భావ దినోత్సవం మన హక్కు.. అందరూ రండి-పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ రేపు మార్చి14వ తేదీన జరుగుతుంది. అమరావతిలోని మంగళగిరి సమీపం ఇప్పటం గ్రామంలో పార్టీ సభ జరుగుతుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.

Pawan Kalyan : ఆవిర్భావ దినోత్సవం మన హక్కు.. అందరూ రండి-పవన్ కళ్యాణ్

Powerstar Pawan Kalyan

Updated On : March 13, 2022 / 5:58 PM IST

Pawan Kalyan :  జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ రేపు మార్చి14వ తేదీన జరుగుతుంది. అమరావతిలోని మంగళగిరి సమీపం ఇప్పటం గ్రామంలో పార్టీ సభ జరుగుతుందని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జనసైనికులకు పార్టీ అభిమానులకు ప్రజలకు ఆహ్వానం చెపుతూ ఒక వీడియో విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే వారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నానని ఆయన తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కార్యక్రమానికి వచ్చేవారెవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళండని ఆయన అందరినీ కోరారు.

“ఇది ఆవిర్భావ సభగా చూడటంలేదు…రాష్ట్ర భవిష్యత్తుకోసం జనసేన పార్టీ దిశా నిర్దేశం చెయ్యబోతోంది…గడిచిన రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలో ఏమేం జరిగింది, ప్రజలు ఏఏ కష్టాలు పడ్డారు.. ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోన్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే ఎలాంటి భవిశష్యత్తును ఇవ్వగలం” ఈ అంశాలపై జనసేన పార్టీ ఒక బలమైన దిశానిర్దేశం చేసే ఆవిర్భావ దినోత్సవం ఇది అని ఆయన అన్నారు.
Also Read : Yanam Murder : యానాంలో పట్టపగలే దారుణ హత్య

ఆవిర్బావ దినోత్సవానికి వచ్చే వారిని ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలుగ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అడ్డంకులు కల్పించినా వారికి చెప్పండి “ఇది మా హక్కు” అని… మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు,.మీరు భయపడాల్సిన పనిలేదు మన ఆవిర్భానవ దినోత్సవం మన హక్కు అని పవన్ కళ్యాణ అన్నారు. అలాగే పోలీసు శాఖ వారికి మనస్పూర్తిగా విన్నవిస్తున్నాము. మాకు సహకరించండి అని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు.

కీలకమైన ఈ సభలో ఏపీకి సంంభిందించిన కొన్ని కీలక విషయాలు మాట్లాడదాము. చాలా మందికి చాలా రకాలైన సందేహాలున్నాయి. చాలామంది మనమీద చాలా సార్లు విమర్శలు చేశారు.వీటన్నిటికీ ఈ9వ ఆవిర్భావ దినోత్సవంలో సమాధానం తెలియ చేస్తాను అని ఆయన అన్నారు. ఈ కార్యకమానికి వస్తున్న అందరికీ హృదయ పూర్వక ఆహ్వానం… తెలుగుప్రజల ఐక్యత కోసం….ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ కోరారు.