Marakatamani Ganapati ideal : ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమైన ‘పంచముఖ మరకత గణపతి విగ్రహం’ వ్యవహారంలో ట్విస్ట్..

ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమైన ‘పంచముఖ మరకత గణపతి విగ్రహం’ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది..

Marakatamani Ganapati ideal : ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమైన ‘పంచముఖ మరకత గణపతి విగ్రహం’ వ్యవహారంలో ట్విస్ట్..

90 Kg Marakatha Ganapathi In Ap Prakasham District (1)

Updated On : June 15, 2022 / 4:58 PM IST

‘Panchamukha Marakatamani Ganapati ideal  in AP : ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లభ్యమైన ‘పంచముఖ మరకత గణపతి విగ్రహం’ వ్యవహారంలో కొత్ మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు అది మరకత మణితో రూపొందించిన విగ్రహం అని కోట్ల రూపాయల విలువ చేస్తుంది అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ మరకత గణపతి విషయంలో జిల్లా ఎస్పీ షాక్ ఇచ్చారు. అదేమంటే ఆ గణపతి విగ్రహం మరకత మణితో తయారు చేసింది కాదని దాని విలువ కోట్లల్లో ఉంటుందని ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.పైగా అది పురాతన విగ్రహం కాదని తెలిపారు ఎస్పీ మలికార్గ్.

పంచముఖ గణపతి విగ్రహం మరకత మణితో తయారు చేయలేదని..అది పురాతనమైనది కాదు అని వెల్లడించారు.ఈ విగ్రహాన్ని అమ్ముతుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డెకాయ్ ఆపరేషన్ లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ విగ్రహం గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ కు అప్పగించామని..వారి నుంచి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.