Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న టిప్పర్ ను తప్పించబోయి బోల్తాకొట్టింది.

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Road Accident

Updated On : January 17, 2025 / 7:08 AM IST

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిఉన్న టిప్పర్ ను తప్పించబోయి బోల్తాకొట్టింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో 22 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వేలూరు సీఎంసీ, నరివి ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Tragic Incident : సింగరాయకొండ పాకల బీచ్ లో తీవ్ర విషాదం.. సముద్ర స్నానాలకు వెళ్లి తిరిగి రాని లోకాలకు..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా చిత్తూరు జిల్లాలోని గంగాసాగరం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటన స్థలంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు వివరాలపై ఆరాతీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.