Tragic Incident : సింగరాయకొండ పాకల బీచ్ లో తీవ్ర విషాదం.. సముద్ర స్నానాలకు వెళ్లి తిరిగి రాని లోకాలకు..
సముద్రంలో ఎంత లోతుకు వెళితే ప్రమాదకరం అని తెలిపే హెచ్చరిక బోర్డులు ఏవీ లేవు.

Tragic Incident : ప్రకాశం జిల్లా పాకల బీచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సింగరాయకొండ పాకల బీచ్ లో సముద్ర స్నానాలకు వచ్చిన ఐదుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మృతులు పొన్నూరు మండలం తిమ్మపాలెంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పాకల బీచ్ పెద్దగా అభివృద్ధి చెందినది కాదు. మత్స్యకారులకు సంబంధించిన బోట్లను నిలిపే ప్రాంతం. ఇక్కడ మెరైన్ పోలీసుల భద్రతా చర్యలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో అక్కడ అలర్ట్స్ కానీ హెచ్చరికల బోర్డుల కానీ లేవు. సముద్రంలో ఎంత లోతుకు వెళితే ప్రమాదకరం అని తెలిపే హెచ్చరిక బోర్డులు ఏవీ లేవు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు సముద్రంలో కొంత లోపలికి వెళ్లారు. అలల తాకిడికి సముద్రం వారిని లాగేసింది. దీంతో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఐదు మందిలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురిలో ఒకరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు.
Also Read : సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. ఈ దొంగ రూ. కోటి డిమాండ్ చేశాడట..!