ఏపీ ఎన్నికలు 2019 : పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ఛేంజ్

నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు మరికొన్ని అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్‌లో అభ్యర్థులను ఛేంజ్ చేస్తున్నారు బాబు. దీనితో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి దక్కదో తెలియక నేతలు టెన్షన్ పడుతున్నారు. టికెట్ రాని వారు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా పూతపట్టు టీడీపీ అభ్యర్థిని మార్చాలని బాబు నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 21వ తేదీ గురువారం స్ర్కీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. పూతపట్టు టీడీపీ అభర్థి పూర్ణం స్థానంలో మాజీ ఎమ్మెల్యే లలితా థామస్‌కి అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం.
Read Also : జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు
ఎందుకంటే జిల్లాలోని టీడీపీ ఆఫీసులో మార్చి 20వ తేదీ బుధవారం అభ్యర్థులకు బీ ఫాం అందచేస్తున్నారు. అయితే…గుండెనొప్పి కారణంగా తాను రాలేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణం మార్చి 21వ తేదీ గురువారం బీ ఫాం తీసుకోవడానికి వచ్చారు. ఏదో జరగబోతోందని టీడీపీ ఆలోచించింది. వెంటనే ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే లలితా థామస్‌కి పూతలపట్టు టీడీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అభ్యర్థిని మార్చిన విషయంపై పూర్ణం ఖండించారు. తనకు టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఆరోపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పూతలపట్టు టీడీపీలో హై డ్రామా నడుస్తోందని చెప్పవచ్చు.
Read Also : తేడా వస్తే జైలుకే : సోషల్ మీడియా ప్రచారానికి ఈసీ బ్రేక్