Raghu Rama Krishna Raju Arrest: కారణాలు చెప్పుకుండా నాన్నను అరెస్ట్ చేశారు

Raghu Rama Krishna Raju Arrest: కారణాలు చెప్పుకుండా నాన్నను అరెస్ట్ చేశారు

Raghu Rama Krishna Raju Arrest

Updated On : May 14, 2021 / 5:50 PM IST

Raghu Rama Krishna Raju: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. రాజుపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు చాలారోజులుగా ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే పుట్టినరోజు నాడే రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు ఆగమేఘాలపై వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేశారంటూ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ విమర్శించారు.

అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండంటూ సీఐడీ అధికారులు అన్నారని భరత్ చెప్పారు. రఘురామను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అంటూ ప్రశ్నించారు రఘురామ కుమారుడు భరత్.

ఒక ఎంపీని, ఒక హార్ట్ పేషెంట్‌ని ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఎలా తీసుకుని వెళ్లారు. కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్‌కు వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు అని అన్నారు భరత్. రూల్ ఆఫ్‌ లా అనేది ఏపీలో లేదా? 35మంది వచ్చేశారు.. ఫోన్లు లాగేసుకున్నారు.

ఇంటికి నోటీసులు అంటించి తీసుకుని వెళ్లిపోయారు. ఒక పేషెంట్ గుండెకు సంబంధించిన సర్జరీ చేసిన వ్యక్తికి కనీసం టాబ్లెట్‌లు ఇవ్వకుండా తీసుకోని వెళ్లారని అన్నారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తుంది.