AP : రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసింది ఎవరు ?

మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిని స్తంభానికి ఎవరు కట్టేశారు ? ఆయన్ను కట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?

AP : రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసింది ఎవరు ?

Raghuveera Reddy

Updated On : November 2, 2021 / 12:13 PM IST

Raghuveera Reddy And Granddaughter : మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిని స్తంభానికి ఎవరు కట్టేశారు ? ఆయన్ను కట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఆయన్ను తాళ్లతో కట్టేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు షాక్ కు గురయ్యారు. అసలు విషయం తెలిసి…నవ్వుకున్నారు. రఘువీరారెడ్డి…ఈయన రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. వ్యవసాయ శాఖగా మంత్రిగా పని చేయడమే కాకుండా…అనంతపురం పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు.

Raghuveera Reddy Former

Read More : Petrol, Diesel Prices : ఆరని పెట్రో మంట..మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఈయన…ప్రస్తుతం రాజకీయాలను అటకెక్కించారు. వ్యవసాయ జీవితాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్లగడ్డం, మెడలో తెల్లటి కండువా..లుంగీతో కనిపించిన ఆయన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. రైతుగా కనిపించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇటీవలే ట్రాక్టర్ తో పొలం దున్నుతూ కనిపించిన ఆయన..తాజాగా..స్తంభానికి తాళ్లతో కట్టేసి కనిపించారు. ఈయనకు మనువరాలు అంటే ఎంతో ప్రేమ..ఇష్టం.

Raghuveera

Read More : Badvel By Poll : వైసీపీ అభ్యర్థి విజయంఇంట్లోనే ఉండాలంటూ..తనతో ఆడుకోవాలంటూ… మనవరాలు సమైరా డిమాండ్ చేసిందని రఘువీరా తెలిపారు. స్వయంగా ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. తనకు సమయం కేటాయించడం లేదని అలిగిన మనువరాలు సమైరా..రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసింది. ఈ దృశ్యంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేయడం..ఆడుకోమని డిమాండ్ చేయడం భలేగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.