RGV vs Kodali Nani: కొడాలి నాని ఎవరో నాకు తెలీదు -రామ్ గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతోంది.

RGV vs Kodali Nani: కొడాలి నాని ఎవరో నాకు తెలీదు -రామ్ గోపాల్ వర్మ

Nani Rgv

Updated On : January 5, 2022 / 3:34 PM IST

RGV vs Kodali Nani: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతోంది. సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ మంత్రి నాని, ఆర్జీవీ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోండగా.. రామ్‌గోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలకు పేర్ని నాని ట్వట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు.

నాని ప్రతి ట్వీట్‌కు మళ్లీ సమాధానం ఇచ్చారు వర్మ.. ఇతర నేతల్లా పరుష పదజాలంతో కాకుండా.. డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూనే నానిపై విమర్శలు గుప్పించారు వర్మ.

ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నానికి కూడా రామ్‌గోపాల్‌వర్మ కౌంటర్‌ ఇచ్చారు. కొడాలి నాని ఎవరో తనకు తెలియదంటూ వర్మ ట్వీట్‌ చేశారు. తనకు తెలిసిన నాని.. నేచురల్ స్టార్‌ నాని ఒక్కడే అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

ఏపీ టికెట్ల రేట్లపై తాను పది ప్రశ్నలు సంధించానన్న ఆర్జీవీ.. ఎవరో కొడాలి నాని ఇచ్చిన కౌంటర్‌కి తనను సమాధానం ఇవ్వాలంటున్నారని.. వాళ్లు చెబుతున్న ఆ కొడాలి నాని ఎవరో తనకు తెలియదని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటికే ఏపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వర్మ.