Sarada Peetham : శ్రీ శారదా పీఠానికి నోటీసులు.. వారం రోజుల్లో కట్టడాలను తొలగించాలని ఆదేశాలు.. లేదంటే..
తొలగింపునకు అయ్యే వ్యయాన్ని మఠం నుంచే వసూలు చేస్తామని నోటీసుల్లో తెలిపింది జీవీఎంసీ.

Sarada Peetham : చిన ముషిడివాడ శ్రీ శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిలో ఉన్న శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని నోటీసుల్లో మఠం మేనేజర్ కు సూచించింది. మొత్తం 9 శాశ్వత కట్టడాలు, కొంత ఖాళీ స్థలం ప్రభుత్వ భూమిలో ఉన్నాయంటూ తెలిపిన జీవీఎంసీ.. 8వ జోనర్ కమిషనర్.. వారం రోజుల్లోగా కట్టడాలు తొలగించకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసులు ఇచ్చారు. తొలగింపునకు అయ్యే వ్యయాన్ని మఠం నుంచే వసూలు చేస్తామని నోటీసుల్లో తెలిపింది జీవీఎంసీ. ఇక శారదా పీఠానికి పెందుర్తి ఎమ్మార్వో కూడా నోటీసులు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో జరిగిన అనేక భూ వ్యవహారాలకు సంబంధించి ఫోకస్ పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం శారదా పీఠానికి భీమిలి ప్రాంతంలో కొన్ని ఎకరాల భూములు కేటాయించింది. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా చిన ముషిడివాడలో శారదా పీఠం మఠం నడుపుతోంది. స్వరూపానంద సరస్వతి ఈ పీఠానికి అధిపతిగా ఉన్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే చర్చ అప్పట్లో టీడీపీ, జనసేన ఆరోపించాయి.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మఠంలో కొంత ప్రభుత్వ భూములను ఆక్రమించి భనవాలను నిర్మించారు అనే ఆరోపణలపై దృష్టి సారించారు. దీనిపై కొన్ని రోజులుగా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి సర్వే చేశారు. దాదాపు 22 సెంట్ల ప్రభుత్వ భూమిని మఠంలో ఆక్రమించారని, కట్డడాలు కట్టారని, మఠం ఆధీనంలో ఉందని నిర్ణారణకు వచ్చారు.
ఈ మేరకు పెందుర్తి ఎమ్మార్వో శారదా పీఠానికి చెందిన మేనేజర్ కు నోటీసులు జారీ చేశారు. 22 సెంట్ల ప్రభుత్వ భూమి మఠం ఆధీనంలో ఉందని, వెంటనే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశించారు.
Also Read : టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. హిందువులకే ఉద్యోగం.. వారికి జీతంలో జీఎస్టీ కటింగ్ లేకుండానే..
లేదంటే తామే ఆ కట్టడాలను కూల్చివేస్తామని, కూల్చివేతలకు అయ్యే ఖర్చును కూడా వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ నోటీసులపై శారదా పీఠం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నోటీసుల్లో ఇచ్చిన ప్రకారం శారదా పీఠం వాళ్లు నిర్మాణాలను కూల్చివేస్తారా? లేక అధికారులు కూల్చేసే పరిస్థితిని తెచ్చుకుంటారా? చూడాలి.