RGV NANI MEET: టికెట్‌పై ఫేస్ టు ఫేస్.. నానితో వర్మ మీటింగ్‌.. క్లారిటీ వస్తుందా?

టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్‌కు ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో.. ఇప్పుడు ఆర్జీవీ, పేర్ని నాని వన్ టు వన్ భేటీకి ముందు కూడా అదే వెదర్ క్రియేట్ అయింది.

RGV NANI MEET: టికెట్‌పై ఫేస్ టు ఫేస్.. నానితో వర్మ మీటింగ్‌.. క్లారిటీ వస్తుందా?

Perni Nani

Updated On : January 9, 2022 / 9:36 PM IST

RGV NANI MEET: టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్‌కు ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో.. ఇప్పుడు ఆర్జీవీ, పేర్ని నాని వన్ టు వన్ భేటీకి ముందు కూడా అదే వెదర్ క్రియేట్ అయింది. ఇప్పటివరకు వీళ్లిద్దరి మధ్య ట్విట్టర్ వార్ మత్రమే సాగింది. మరికొన్ని గంటల్లో ఇద్దరూ డైరెక్ట్‌గా, ఫేస్ టూ ఫేస్ మాట్లాడుకోబోతున్నారు. టికెట్ రేట్ల ఇష్యూపై ఏదో ఒకటి తేల్చుకోబోతున్నారు.

పేర్ని నానికి ఆర్జీవీ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆర్జీవీ, మంత్రి పేర్ని నాని మధ్య జరగబోయే వన్ టు వన్ మీటింగ్‌కు.. కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరికొన్ని గంటల్లోనే.. వీళ్లిద్దరూ.. ఏపీ సచివాలయంలో ఒకే టేబుల్ మీద సమావేశం కాబోతున్నారు. ఈ మీటింగ్‌లో.. సినిమా టికెట్ రేట్ల వ్యవహారం క్లైమాక్స్‌కి వస్తుందా? వీళ్లిద్దరూ.. ఏం చర్చించబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది.

మొన్నటివరకు ఆర్జీవీకి, పేర్ని నానికి మధ్య.. ట్విట్టర్‌ వేదికగా మినీ యుద్ధమే నడిచింది. వర్మ పేల్చిన పంచ్‌లకు.. పేర్ని నాని తన స్టైల్‌లో ఆన్సర్స్ ఇచ్చారు. వాటికి సంతృప్తి చెందని వర్మ.. అనుమతిస్తే మిమ్మల్ని కలిసి అన్నీ వివరిస్తానన్నారు. దీంతో.. త్వరలోనే కలుద్దామని.. మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే.. ఆర్జీవీ క్వశ్చన్ బ్యాంక్‌కు.. పేర్ని నాని ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారన్నదే ఆసక్తిగా మారింది. ట్విట్టర్‌లో.. వీళ్లిద్దరి మధ్య నడిచిన ట్వీట్ వార్‌ చూస్తే.. ఇద్దరికిద్దరు భిన్న వాదనలు వినిపించారు.

పేర్ని నానితో జరగబోయే మీటింగ్‌లో.. ఆర్జీవీ కొన్ని ప్రశ్నలు సంధించే అవకాశముంది. టికెట్ రేట్లు ప్రభుత్వానికేం సంబంధం? సినిమా క్వాలిటీ తగ్గితే ఎలా? సినిమాలకు సబ్సిడీ ఇవ్వొచ్చు కదా? రేషన్ థియేటర్లు పెట్టొచ్చు కదా? మీరే టికెట్లు కొని.. తక్కువ ధరకు అమ్మొచ్చు కదా? సినిమా బడ్జెట్ మీరెలా నిర్ణయిస్తారు? ప్రభుత్వమే సినిమాలు తీయొచ్చు కదా? ఉద్యోగులందరికీ ఒకేలా జీతాలుంటాయా? అన్ని హోటల్స్‌లో సేమ్‌ రేట్లు ఉంటాయా? సినిమా ఇండస్ట్రీపై మీకు అవగాహన ఉందా? థియేటర్లు.. వినోద సేవలందించే ప్రాంగణాలని ఎక్కడ రాసుంది? థియేటర్లో సౌకర్యాలు చూడకుండా.. ఏరియాను బట్టి టికెట్ రేటు ఎలా నిర్ణయిస్తారు? టికెట్లు ఎంతకు అమ్ముతున్నారో.. చెప్పి అమ్ముతుంటే.. బ్లాక్ మార్కెటింగ్ ఎలా అవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ.. ఆర్జీవీ పేర్ని నానిని అడిగే అవకాశముంది.

ఎలా చూసుకున్నా.. టికెట్ రేట్ల విషయంలో ఆర్జీవీ, పేర్ని నాని తగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడు.. డైరెక్ట్‌గా కలవబోతున్నారు. ఆర్జీవీ ఏం అడుగుతారు? ఆయన్ని.. పేర్ని నాని ఎలా కన్విన్స్ చేస్తారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. చివరికి.. ఎవరి మాట నెగ్గుతుందన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.