రైతు భరోసా పథకానికి రూ.3,615 కోట్లు.. రైతులకు రూ.13వేల 500 ఆర్థిక సాయం

  • Published By: srihari ,Published On : June 16, 2020 / 09:52 AM IST
రైతు భరోసా పథకానికి రూ.3,615 కోట్లు.. రైతులకు రూ.13వేల 500 ఆర్థిక సాయం

Updated On : June 16, 2020 / 9:52 AM IST

వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకానికి రాష్ట్ర బడ్డెట్‌లో రూ.3,615.60 కోట్లకు పైగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రైతుకు రూ.13వేల 500 ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం వ్యవసాయానికి ఆర్థిక వ్యవస్థకు మారిపోయింది. నాలుగింట మూడు వంతుల కార్మికులకు ఉపాధి కల్పించనుంది.  2019 అక్టోబర్ 15న ప్రారంభించగా… ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయ అవసరాలకు నిమిత్తం రూ.13, 500 వార్షిక పెట్టుబడిని సమకూర్చనున్నట్టు ఆయన చెప్పారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో  46 లక్షల 51వేల అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. ఇందులో  ఒక లక్ష 58వేల కౌలుదారు కుటుంబాలు కూడా ఉన్నాయని అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సాయంగా రైతు భరోసా పథకానికి బడ్జెట్ లో రూ.3వేల 615 కోట్లు కేటాయించాలే ప్రతిపాదించినట్టు బుగ్గన స్పష్టం చేశారు. వడ్డీలేని రుణాలు తీసుకున్న రైతులకు పంటల నిమిత్తం రూ.లక్ష వరకు పంట రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లుస్తుందని అన్నారు. ఇందుకుగానూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.11 వందల కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.  

పశుగాణాభివృద్ధికి మత్స్య రంగానికి రూ.1279.78 కోట్లు కేటాయించింది. 104, 108లకు రూ.470.29 కోట్లు కేటాయించగా, స్కిల్ డెవలప్ మెంట్ కు రూ.856.64 కోట్లు కేటాయించింది. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ కు రూ.16,710.34 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.