AP COVID : వ్యాక్సిన్ల కొనుగోళ్లకు రూ. 50 కోట్లు

వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.

AP COVID : వ్యాక్సిన్ల కొనుగోళ్లకు రూ. 50 కోట్లు

Cm Jagan

Updated On : May 22, 2021 / 11:03 AM IST

Covid Vaccines : ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 20 వేలకు పైచిలుకు వైరస్ బారిన పడుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. దీంతో ప్రభుత్వం గ్లోబల్ టెండర్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా..వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.

కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కొనుగోలుకు సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు రూ. 50 కోట్లు చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈ డబ్బులు చెల్లించాలని ఏపీఎంఎస్ఐడీసీ (ఏపీ మెడికల్ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ను ఆదేశించినట్లు చెప్పారు. కోవిషీల్డ్ ఒక డోస్ రూ. 300, టాక్స్ 5 శాతంతో కలిపితే..రూ. 315, కోవాగ్జిన్ ఒక డోస్ రూ. 400, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.415 వంతున చెల్లించనున్నట్లు తెలిపారు.

11,45,450 కోవిషీల్డ్, 3,45,680 కోవాగ్జిన్ డోసుల కొనుగోలు కోసం ఏపీఎంఎస్‌డీఐసీ ద్వారా ఆయా ఇనిస్టిట్యూట్ లకు చెల్లింపులు చేయనుంది. రూ. 50,39,30,700 చెల్లించాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. కోవిషీల్డ్ టీకాల కోసం రూ. 36,08,45.100. కోవాగ్జిన్ టీకాల కోసం రూ. 14,30,85,600 చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. జూన్ నాటికి 45 ఏళ్లు పైబడిన వారికి రెండు డోసులు ఇస్తామన్నారు.

Read More : Hathras: కొవిడ్‌తో భార్య మరణం, రైలుకు ఎదురుగా దూకిన భర్త