ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు : చర్యలు తీసుకోవడానికి ఆర్టీఏ రెడీ

సంక్రాంతి పండుగను ఆసరగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రైవేట్ దందాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 08:23 AM IST
ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు : చర్యలు తీసుకోవడానికి ఆర్టీఏ రెడీ

Updated On : January 8, 2020 / 8:23 AM IST

సంక్రాంతి పండుగను ఆసరగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రైవేట్ దందాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

సంక్రాంతి పండుగను ఆసరగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రైవేట్ దందాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకోవడానికి ఆర్టీఏ రెడీ అయ్యింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు వస్తుండడంతో… వాటిపై చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఆర్టీఏ అధికారులకు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలుచోట్ల ఆర్టీఏ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. 

వరుసుగా రెండో రోజు 56 ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. కనకదుర్గమ్మ వారధి, గరికపాడు చెక్ పోస్టు, పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 56 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే అధిక చార్జీలు వసూలు చేస్తున్న 73 బస్సులను సీజ్‌ చేశారు. మరో 85 బస్సులపై  కేసులు నమోదు  చేశారు. ఆన్‌లైన్‌లో అధిక ధరలకు టిక్కెట్లు బుక్‌ చేసిన రెడ్‌ బస్‌, అభి బస్‌లకు కూడా నోటీసులు ఇచ్చారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్, మార్నింగ్ ట్రావెల్స్, కావేరీ, భవానీ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు అయ్యాయి. రెడ్ బస్, అబీ బస్ యాజమాన్యాలకు మోటార్ వెహికిల్ యాక్ట్ కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. 

ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 56 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ రోజు 56 బస్సులపై కేసులు, నిన్న 73 బస్సులు సీజ్ అవ్వడంతో పత్రాలు లేకుండా తిరుగుతూ.. విచ్చలవిడిగా టికెట్ ధరలు పెంచుతూ తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ వణికిపోతున్నాయి. రోడ్లు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు.