పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా .. 40అడుగుల లోతులో పడిన బస్సు
కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా పులివెందులలోని డంప్ యార్డ్ వద్ద

Buss Accident
RTC Bus Accident : కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా పులివెందులలోని డంప్ యార్డ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 40 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని బస్సులోని వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా.. 15మందికి స్వల్పగా గాయాలయ్యాయి.