Sai Priya Missing Mystery : వైజాగ్ బీచ్‌లో మిస్సింగ్ మిస్టరీ.. అసలేం జరిగింది? సాయిప్రియ ఎక్కడ?

వైజాగ్ ఆర్కే బీచ్ లో అసలేం జరిగింది? సాయి ప్రియ ఎలా మిస్ అయ్యింది? సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో అంతా క్లియర్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా అనుమానాలు ఎన్నో.

Sai Priya Missing Mystery : వైజాగ్ బీచ్‌లో మిస్సింగ్ మిస్టరీ.. అసలేం జరిగింది? సాయిప్రియ ఎక్కడ?

Sai Priya Missing Mystery

Updated On : July 26, 2022 / 7:42 PM IST

Sai Priya Missing Mystery : వారిద్దరికి పెళ్లై జూలై 25వ తేదీ నాటికి ఏడాది అయ్యింది. ఉద్యోగం కోసం భర్త హైదరాబాద్ లో, చదువు కోసం భార్య వైజాగ్ లో ఉంటున్నారు. ఫస్ట్ మ్యారేజ్ డే రానే వచ్చింది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసేందుకు భర్త హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాడు. భార్యకు సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు భర్త. లక్ష రూపాయలు విలువ చేసే బంగారు గాజులు కానుకగా ఇచ్చాడు. ఇదీ వైజాగ్ బీచ్ లో సోమవారం మిస్ అయిన సాయిప్రియ స్టోరీ.

కన్నుమూసి తెరిచే లోపు భార్య కనిపించకుండా పోయిందంటున్నాడు సాయిప్రియ భర్త శ్రీనివాస్. సోమవారం సాయంత్రం వైజాగ్ ఆర్కే బీచ్ లో అసలేం జరిగింది?

Visakhapatnam : పెళ్లిరోజు భర్తతో కలిసి ఆర్కే బీచ్ కు వెళ్లిన వివాహిత గల్లంతు..కొనసాగుతున్న గాలింపు చర్యలు

పెళ్లి రోజు కావడంతో నిన్న ఉదయం 11 గంటలకు దంపతులు ఇంటి నుంచి బయలుదేరారు. 12 గంటలకు సింహాచలం గుడికి వెళ్లొచ్చారు సాయిప్రియ, శ్రీనివాస్. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఇంటికి చేరుకున్నారు. మళ్లీ సాయంత్రం మూడున్నర గంటలకు ఇంటి నుంచి బయలుదేరి నాలుగన్నర గంటలకు బీచ్ కు చేరుకున్నారు. 5గంటల 15 నిమిషాల వరకు బీచ్ మెట్లపై కూర్చుని సెల్ఫీలు దిగారు. 5 గంటల 20 నిమిషాలకు బీచ్ లో కి వెళ్లారు. గంటకు పైగా ఇద్దరూ నీటిలో ఇద్దరూ ఆడుకున్నారు. 6.30 గంటలకు తన వస్తువులను భర్తకు ఇచ్చిన సాయిప్రియ ఇంకొంత లోపలికి వెళ్లింది. 6గంటల 50 నిమిషాలకు ఓ మేసేజ్ రావడంతో అది చూసి వెనక్కి తిరిగి చూసేలోపే సాయిప్రియ మాయమైందని భర్త శ్రీనివాస్ చెబుతున్నాడు. చీకటి పడటం, చుట్టూ ఎవరూ చూడకపోవడంతో సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీగా మారింది.

Madhurawada Murali Missing Case : ఆమెకు 35.. వాడికి 18.. మధురవాడ మురళి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

పెళ్లైన నాటి నుంచి ఇద్దరికీ ఎలాంటి గొడవలు లేవని సాయిప్రియ తండ్రి అప్పలరాజు చెబుతున్నారు. శ్రీనివాస్ కూడా బాగానే చూసుకునే వాడని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది లేదని, ఎలాంటి అనుమానాలు కూడా లేవని చెబుతున్నారు. తన బిడ్డ సేఫ్ గా తిరిగొస్తే చాలంటున్నారు సాయిప్రియ తండ్రి. కానీ, సీన్ చూస్తే అన్నీ అనుమానాలే. తప్పు భర్తదా? లేదా భార్యదా? తెలియడం లేదు. పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారుతోంది. ఇక మంగళవారం ఉదయం నుంచి కోస్ట్ గార్డ్స్.. హెలికాప్టర్, నేవీ షిప్పులతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా అన్ని విషయాలు క్లియర్ గానే ఉన్నాయని చెబుతున్నారు. మరి సాయిప్రియ ఏమైనట్లు?

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw