Madhurawada Murali Missing Case : ఆమెకు 35.. వాడికి 18.. మధురవాడ మురళి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

ఎంత పక్కాగా ప్లాన్ చేసినా వివాహేతర సంబంధం హత్య కేసుల్లో మాత్రం నిందితులు ఇట్టే దొరికిపోతారు. విశాఖలోని మధురవాడలో మురళి మిస్సింగ్ కేసులో ఇది మరోసారి రుజువైంది. భర్త మురళిని కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. (Madhurawada Murali Missing Case)

Madhurawada Murali Missing Case : ఆమెకు 35.. వాడికి 18.. మధురవాడ మురళి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

Madhurawada Murali Missing Case : ఎంత పక్కాగా ప్లాన్ చేసినా వివాహేతర సంబంధం హత్య కేసుల్లో మాత్రం నిందితులు ఇట్టే దొరికిపోతారు. విశాఖలోని మధురవాడలో మురళి మిస్సింగ్ కేసులో ఇది మరోసారి రుజువైంది. భర్త మురళిని కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.

ఆమె వయసు 35.. వాడి వయసు 18 ఏళ్లు.. భర్త ఎన్ఆర్ఐ కావడంతో ఒంటరిగా ఉన్న వివాహితను యువకుడు ట్రాప్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన రెండు నెలల్లోనే ఆమె ఇంట్లో తేలాడు. ఆమె వివాహేతర సంబంధం కొనసాగించాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ కలిసి మురళిని దారుణంగా హత్య చేశారు.(Madhurawada Murali Missing Case)

TS Crime : అన్నను హత్య చేయటానికి రూ.1 కోటి సుపారీ ఇచ్చిన వికారాబాద్ రవాణా అధికారి..

శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస గ్రామానికి చెందిన మురళి ఈస్ట్ ఆఫ్రికాలోని కాలేజీలో 8ఏళ్లుగా ప్రొఫెసర్ గా పని చేసేవాడు. 2014లో మృదులను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2019 వరకు భర్తతో పాటు భార్య కూడా ఈస్ట్ ఆఫ్రికాలోనే ఉండేది. వీరికి ఒక బాబు పుట్టాడు. 2019లో ఆమె అనారోగ్యానికి గురి కావడంతో విశాఖకు మకాం మార్చింది. మధురవాడలో ఒక ప్లాట్ తీసుకుని ఏడేళ్ల కొడుకుతో ఉంటోంది. ప్రతి ఏడాది సెలవులకు రెండు నెలలు విశాఖకు వచ్చి భార్య, కొడుకు, తల్లిదండ్రులతో గడిపేవాడు మురళి. ఈ నెల 9న కుటుంబసభ్యులతో గడిపేందుకు వచ్చిన మురళి.. భార్య మృదుల, ఆమె ప్రియుడు హరిశంకర్ చేతిలో హతమయ్యాడు.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

ఈ కేసు వివరాలను మధురవాడ ఏసీపీ చుక్క శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. గతేడాది ఇన్ స్టాగ్రామ్ లో మృదుల, హరిశంకర్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నవంబర్ లో మృదులకు పరిచయమైన హరిశంకర్.. జనవరి నుంచి ఆమె ఇంట్లోనే మకాం వేశాడు. ఇక అప్పటి నుంచి వారి రాసలీలలు కొనసాగుతున్నాయి.

అయితే ఈ నెల 9న మృదుల భర్త మురళి విశాఖకు వస్తానని చెప్పాడు. రెండు నెలలో విశాఖలోనే ఉంటానని చెప్పాడు. దీంతో మృదుల, ఆమె ప్రియుడు హరిశంకర్ ఆలోచనలో పడ్డారు. ఈ రెండు నెలలు ఒకరినొకరు కలవకుండా ఎలా ఉండాలా అని ఆలోచించారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త మురళిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ చేశారు. ఈ నెల 9న విశాఖకు వచ్చిన మురళిని 10న ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు.

Lip Lock Challenge : లిప్‌లాక్ ఛాలెంజ్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. 8మంది విద్యార్థులు అరెస్ట్

హత్యకు రెండు రోజుల ముందు ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 1.30 గంట వరకు మాట్లాడుకున్నారు. పక్కా ప్లాన్ తో ఈ నెల 10న మురళిని హత్య చేశారు. రాత్రి పడుకునే సమయంలో భార్య మృదుల భర్తకు తెలియకుండా తలుపులు తీసి పెట్టింది. దీంతో ప్రియుడు హరిశంకర్ ఇంట్లోకి దూరాడు. డీప్ స్లీప్ లోకి వెళ్లాక మురళిని చంపాలని అనుకున్నారు.

అర్థరాత్రి 2.30 గంటల సమయంలో మురళి బాత్రూమ్ కి వెళ్లి బెడ్ రూమ్ లోకి వచ్చాడు. బెడ్ రూమ్ లోకి రాగానే భార్య మృదుల, ప్రియుడు హరిశంకర్.. మురళిపై దాడి చేశారు. దోసల పెన్నం, కుక్కర్ మూతతో బాగా కొట్టారు. అలా మురళి చనిపోయేవరకు తీవ్రంగా కొట్టారు. చివరికి తాడుతో మెడకు ఉరి బిగించారు. దీంతో మురళి చనిపోయాడు. తర్వాత మురళి మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి పాలకవలస డ్రైనేజీ బ్రిడ్జి కింద పొదల్లో పడేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ నెల 10న శ్రీకాకుళం వస్తానన్న మురళి రాకపోవడంతో అతడి సోదరులు మృదులను నిలదీశారు. దీంతో డెడ్ బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని మళ్లీ బ్రిడ్జి వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. అయితే హత్య సమయంలో మృతుని పర్స్, వాచ్ లభించడం ఈ కేసుని చేధించడంలో పోలీసులకు కీలకంగా మారాయి. మురళి కుటుంబసభ్యుల ఒత్తిడితో ఈ నెల 17న భర్త మురళి మిస్సింగ్ కేసు పెట్టింది మృదుల.

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మృదుల పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమె మీద అనుమానం వచ్చింది. అంతే.. ఆ దిశగా విచారణ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హరిశంకర్ వర్మ తరుచుగా మృదుల ఇంటికి వస్తాడని ఎంక్వైరీలో తెలిసింది. హరిశంకర్ వర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా అతడు నిజం కక్కేశాడు. మురళి హత్య చేసినట్లు హరిశంకర్ ఒప్పుకున్నాడు. దీంతో మృదుల, ఆమె ప్రియుడు హరిశంకర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.