Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

తన కొడుకు పుట్టిన రోజు ఉందని, ఇంటికి రావాలని పిలిచి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక రైల్వే ఉద్యోగి. తర్వాత అతడితోపాటు మరో వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. దీనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగింది.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

Woman Gang Raped

Woman Gang-Raped: మహిళపై రైల్వే స్టేషన్ పరిధిలోనే రైల్వే సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 30 ఏళ్ల యువతి, ఢిల్లీలో ఒంటరిగా ఉంటోంది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఉపాధి కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రైల్వేలో పనిచేస్తున్న సతీష్ కుమార్ రెండేళ్ల క్రితం పరిచయమయ్యాడు.

Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు..10 జిల్లాలకు రెడ్ అలర్ట్

మహిళకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తన కొడుకు పుట్టిన రోజుతోపాటు, కొత్త ఇంటి గృహ ప్రవేశం ఉందని ఆ మహిళన తను ఇంటికి రావాలని కోరాడు. దీంతో ఆమె శుక్రవారం రాత్రిపూట పదిన్నరకు మెట్రోరైలులో స్టేషన్ చేరుకుంది. అక్కడ్నుంచి ఆమెను సతీష్ కుమార్ స్టేషన్ పరిధిలోనే ఉన్న రైల్వే సిబ్బంది ఉపయోగించే ఒక కోచ్‌ (గది)లోకి తీసుకెళ్లాడు. దీన్ని రైల్వేకు సంబంధించిన ఎలక్ట్రికల్ సిబ్బంది వాడుతుంటారు. ఆ గది లోపలికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత మరో వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. ఈ సందర్భంగా మరో ఇద్దరు బయట కాపలా ఉన్నారు. వీళ్లంతా రైల్వేకు సంబంధించిన వారే. తర్వాత అక్కడ్నుంచి బయటపడ్డ బాధిత మహిళ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసింది.

Sravana Bhargavi : శ్రావణభార్గవిపై తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. వీడియో తొలగించాలని అన్నమయ్య వంశస్థుల డిమాండ్..

దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. పోలీసులు నిందితుల్ని ఢిల్లీ కోర్టులో హాజరుపర్చగా, కోర్టు సూచనలతో వారిని జైలుకు తరలించారు. మరోవైపు నలుగురు నిందితుల్ని ఉద్యోగంలోంచి తొలగించినట్లు రైల్వే శాఖ తెలిపింది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.