Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు..10 జిల్లాలకు రెడ్ అలర్ట్

వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు..10 జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana Rain Alert

Telangana Rains :  వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వారు వివరించారు. కాగా… రాష్ట్రంలో అనేక చోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

నిన్న ఉత్తర ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అవర్తనం ఈ రోజు ఇంటీరియర్ ఒడిస్సా & పరిసర చత్తీస్‌ఘడ్ లలో కొనసాగుతోందని… ఇది సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉందని అధికారులు వివరించారు. ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమరన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని అధికారులు వివరించారు.

మరో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ 
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ ,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ,కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, మంచిర్యాల, నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి, జనగాం, సిద్దిపేట్, వికారాబాద్, కామారెడ్డి మహబూబ్ నగర్   జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.