Lip Lock Challenge : లిప్‌లాక్ ఛాలెంజ్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. 8మంది విద్యార్థులు అరెస్ట్

కర్నాటకలో కాలేజీ విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వ్యవహారం దుమారం రేపుతోంది. విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కేసులో పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆ వీడియోను చూపి ఇద్దరు విద్యార్థినులపై తోటి విద్యార్థులు అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

Lip Lock Challenge : లిప్‌లాక్ ఛాలెంజ్.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. 8మంది విద్యార్థులు అరెస్ట్

Lip Lock Challenge

Lip Lock Challenge : కర్నాటకలో కాలేజీ విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వ్యవహారం దుమారం రేపుతోంది. విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. చక్కగా కాలేజీకి వెళ్లి బుద్దిగా చదువుకోవాల్సి పిల్లలు.. ఇలా పెడదోవ పట్టడం సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. విద్యార్థుల ముద్దుల పోటీ దుమారం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఖాకీలు.. ఆ ఘటనకు పాల్పడిన 8మంది విద్యార్థులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

మంగళూరులోని ఓ ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఓ ప్రైవేటు అపార్ట్ మెంటులో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అసలే కుర్రకారు.. పైగా పక్కనే అమ్మాయిలు.. దీంతో కుర్రాళ్లు రెచ్చిపోయారు. ‘ట్రూత్‌ ఆర్‌ డేర్‌’ (Truth or Dare) పోటీ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా లిప్‌లాక్‌ ఛాలెంజ్‌ (Lip-Lock Challenge) నిర్వహించారు.

యూనిఫాంలో ఉన్న విద్యార్థిని, విద్యార్థి ముద్దులు పెట్టుకుంటూ తన్మయత్వంలో మునిగిపోయారు. చుట్టూ ఉన్న స్నేహితులు కేకలు వేస్తూ వారిని మరింత ప్రోత్సహించారు. అంతేకాదు ఓ విద్యార్థి దీన్నంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ బృందంలోని ఓ 17ఏళ్ల విద్యార్థి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ వీడియోను ఇటీవల పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Students Kissing Competition : కాలేజీ విద్యార్ధుల మధ్య ముద్దుల పోటీ..వాట్సాప్ లో వైరల్

ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. కాగా, పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వీడియోను చూపించి ఆ బృందంలోని ఇద్దరు విద్యార్థినులపై తోటి విద్యార్థులు అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దీంతో ఎనిమిది మంది విద్యార్థులపై పోక్సో (POCSO) చట్టంతోపాటు ఐపీసీ, ఐటీ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు అనంతరం వారిని జువనైల్‌ జస్టిస్‌ కోర్టులో ప్రవేశపెట్టినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు పోలీస్ కమిషనర్. తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపై తల్లిదండ్రులు, తమ విద్యార్థుల కార్యకలాపాలపై కాలేజీ యాజమాన్యాలు నిరంతరం నిఘా వేసి ఉంచాలన్నారు. పిల్లల్లో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే సరిదిద్దాలన్నారు. సీరియస్ విషయాలు అయితే వెంటనే పోలీసుల దృష్టి తీసుకురావాలన్నారు.