Sai Supriya Case : తల్లి మాటే వినేవాడు, నన్ను శత్రువులా చూశారు- 14ఏళ్ల నరకం నుంచి వివాహితకు విముక్తి
విజయనగరం గృహ నిర్బంధం కేసులో వివాహితకు విముక్తి లభించింది. 14 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూసిన సాయి సుప్రియ ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను కలవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. అత్తింట నిర్బంధం నుంచి విడిపించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది సాయి సుధ.

Sai Supriya Case : విజయనగరం గృహ నిర్బంధం కేసులో వివాహితకు విముక్తి లభించింది. 14 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూసిన సాయి సుప్రియ ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను కలవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. అత్తింట నిర్బంధం నుంచి
విడిపించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది సాయి సుధ.
ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన సాయి సుప్రియకు 2008లో మధుసూదన్ తో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత ఒక్కసారి మాత్రమే పుట్టింటికి వెళ్లానని సాయి సుప్రియ తెలిపారు. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా అత్తింటి వారు చేశారన్న సాయి సుప్రియ, తనను తన పుట్టింటి వారిని శత్రువుల్లా భావించే వారన్నారు. తన అత్తింటి వారికి ఆడపిల్ల అనే ఫీలింగ్ ఎక్కువ అన్న సాయిసుప్రియ భర్త మధుసూదన్ సైతం తల్లి మాటే వినేవాడని ఆవేదన
వ్యక్తం చేసింది.
Also Read..Husband Locked Wife : భార్యను 11 ఏళ్లుగా ఇంట్లోనే బంధించిన భర్త
తన పుట్టింటి వారిని శత్రువుల్లా చూశారని సాయిసుప్రియ కన్నీటిపర్యంతమైంది. 14ఏళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూశానని ఆనందం వ్యక్తం చేసింది.
”పెళ్లైన ఈ 14ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే తాను తన పాపతో పుట్టింటికి వెళ్లానని సాయి సుప్రియ తెలిపింది. బయటి వ్యక్తులతో చివరికి తల్లిదండ్రులతో కూడా నాకు కాంటాక్ట్స్ లేకుండా చేశారు. బయటికి ఎలా వెళ్లాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. పెళ్లైన కొత్తలో అత్తతో కలిసి బయటకు వెళ్లాను. ఆ తర్వాత పూర్తిగా ఇంట్లోనే ఉన్నాను. వాళ్లు మనసులో ఏవో తెలియని అపోహలు పెట్టుకున్నారు. వాటిని క్లియర్ చేసుకుందాం అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. అలా అలా నన్ను, నా తల్లిదండ్రులను శత్రువుల్లా భావించారు.
నా పిల్లలను బాగానే చూసుకునే వారు. అయితే ఆడపిల్ల అనే ఫీలింగ్ ఉంది. ఏదైనా అవసరం ఉంటేనే పిల్లలను వచ్చే వారు. అంతకుమించి వారితో టచ్ లేదు. నా ఇద్దరు బాబులతో నాకు అటాచ్ మెంట్ తక్కువ. మా అత్తతో వారికి అటాచ్ మెంట్ ఎక్కువ. పాపను నేను చూసుకునే దాన్ని. వాళ్ల అమ్మ ఏం చెబితే అదే చేసేవాడు నా భర్త. అతడికంటూ ప్రత్యేకంగా అభిప్రాయం ఏమీ లేదు. నాకు ఏదైనా అవసరం ఉన్నా అడిగే అవకాశం లేదు. నాకు ఏదైనా కావాలన్నా అడగటానికి నాకు ఇష్టం లేదు. నా అత్త ఏం చెబితే అదే నాకు ఇచ్చే వాళ్లు” అని సాయి సుప్రియా తన గోడు వెళ్లబోసుకుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
”పెళ్లి సమయంలో 30 తులాలకు పైనే గోల్డ్ కట్నంగా ఇచ్చాము. పాప పుట్టినప్పుడు 5 తులాలు ఇచ్చాం. పిల్లాడికి 5 తులాలు ఇచ్చాం. 3 కేజీల దాకా వెండి ఇచ్చాము. ప్రతి వస్తువూ ఇచ్చాము. ఫర్నీచర్ కూడా ఇచ్చాం. మేము ఏమీ తక్కువ చేయలేదు. మంచి వాళ్లు అనే మా అమ్మాయిని ఇచ్చాము. మా అమ్మాయిని చూసి చాలా బాధపడ్డాం. మమ్మల్ని ఏనాడూ లోనికి రానివ్వలేదు. పోలీసులను కూడా ఇబ్బంది పెట్టారు. మా ఆయనకు బాలేదు. నా కూతురుని పంపించాలని వేడుకున్నాం” అని సాయి సుప్రియ తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు.
కట్టుకున్న భార్యను 14ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించాడో భర్త. తనను పెళ్లి చేసుకున్న పాపానికి ఆమెను బంధీని చేసి కన్నవారికి, బాహ్య ప్రపంచానికి దూరం చేశాడా శాడిస్ట్ మొగుడు. భార్యకు తోడుగా ఉండాల్సిన వాడే.. ఆమెను ఒంటరిని చేసి మానసికంగా వేధించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14ఏళ్ల పాటు నరకం చూపించాడు. బాధ్యతాయుతమైన న్యాయవాద వృత్తిలో ఉంటూ దారుణానికి ఒడిగట్టాడు. చీకటి గదిలో మగ్గిన ఆ మహిళ పరిస్థితి అందరినీ కలచివేసింది. తట్టుకోలేని ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో బాధితురాలికి విముక్తి లభించింది. చాలాకాలం తర్వాత కూతురిని చూసిన తల్లి కన్నీటిపర్యంతం అయ్యింది.
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు విజయనగరం పట్టణానికి చెందిన లాయర్ మధుసూదన్‌తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. న్యాయవాది మధుసూదన్ తన తల్లి, తమ్ముడి మాటలు విని కట్టుకున్న భార్యను బయట ప్రపంచానికి దూరం చేశాడు. ఏకంగా పద్నాలుగేళ్లపాటు చీకటి గదిలో బంధించాడు. ఎప్పుడూ బయటకు తీసుకొచ్చేవాడు కాదు. పిల్లల్ని కూడా తల్లి దగ్గరకు వెళ్లనివ్వడు. తన తల్లితోనే పిల్లల ఆలనా పాలనా చూపించేవాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు 14ఏళ్లు నరకం చూపించాడు.
మధుసూదన్ బంధువులు, సాయిసుప్రియ తల్లిదండ్రులు ఆరా తీస్తే నేను లాయర్ని అని బెదిరించేవాడు. తమ కుమార్తె బతికి ఉందో లేదో కూడా తెలియని స్థితిలో సాయి సుప్రియ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో తమ కుమార్తె ఏమైందో తెలియక 14ఏళ్లు నరకయాతన అనుభవించారు. చివరికి న్యాయపోరాటం చేసి కూతురికి విముక్తి కల్పించారు.