ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో తెలుసా?

Sajjala Ramakrishna Reddy: సీరియస్‌గా చేసిన సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో తెలుసా?

Sajjala Ramakrishna Reddy

Updated On : June 1, 2024 / 9:16 PM IST

దేశంలో ఎన్నికలు ముగిసిన వేళ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కావడంతో దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ విజయం గురించి తాము ముందు నుంచే చెబుతున్నామని తెలిపారు.

ట్రెండ్స్ అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని సజ్జల చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే బెటర్‌గా జూన్ 4న ఫలితాలు ఉంటాయని అన్నారు. సీరియస్‌గా చేసిన సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పారు. టీడీపీకి అనుకూలంగా చెబుతున్న సంస్థలు అంత సీరియస్‌గా సర్వేలు చేసినవి కాదని అన్నారు.

సర్వేలు ఎలా చేశారనేది కూడా చూడాలని, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు చూడాలని సజ్జల తెలిపారు. సీరియస్‌గా చేసిన సర్వేలు తమకు ఎందుకు అనుకూలంగా ఇచ్చారో చెప్పాయని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ లో సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని తెలిపారు. గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని దేశ వ్యాప్తంగా నిబంధనలు ఉన్నాయని చెప్పారు.

Also Read: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమవుతాయా? గతంలో అనేక సార్లు ఘోరంగా విఫలం.. ఎప్పుడెప్పుడంటే?