Sajjala Ramakrishna Reddy: అందుకే మాపై కేసులు పెడుతున్నారు: సజ్జల
విష సంస్కృతి మొదలు పెట్టారని, విచారణ లేకుండానే ఎవరో వాంగ్మూలం ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్లు నమోదు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Sajjala Ramakrishna Reddy
టీడీపీ కార్యాలయంపై దాడి పేరుతో అక్రమంగా కేసు పెట్టారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, ప్రభుత్వ పెద్దలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాను లేనన్న సంగతి వారికి తెలుసని, 120వ నిందితుడిగా తన పేరును చేర్చారని అన్నారు. స్వేచ్ఛగా తిరిగేందుకు లేకుండా కేసులు పెడుతున్నారని, అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు, నేతల్లో పట్టుదల పెరుగుతోందని తెలిపారు.
విష సంస్కృతి మొదలు పెట్టారని, విచారణ లేకుండానే ఎవరో వాంగ్మూలం ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్లు నమోదు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని భావిస్తే అది సాధ్యం కాదని అన్నారు. పట్టాభి ఓ ప్లాన్‌తోనే తప్పుడు మాటలు మాట్లాడారని ఆరోపించారు. వైసీపీ లేకుండా చేయాలని చూస్తున్నారని, కథలు రాస్తున్నారని తెలిపారు. ప్రొసిజర్స్ ఉంటాయని, వాటిని ఫాలో అవ్వాలని చెప్పారు. తాను కార్యాలయంలో ఉన్నట్లు పోలీసులు రాసుకున్నారని అన్నారు.
రోడ్లపై పడిన వర్షపునీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. అలాగే రోడ్లపై ఉండాలా?: రేవంత్ రెడ్డి