Sangishetty Ashok : జనసేన రాష్ట్ర కార్యదర్శిగా సంగిశెట్టి అశోక్.. కాకినాడ నగర అధ్యక్షుడిగా తోట సుధీర్
జనసేన రాష్ట్ర కార్యదర్శిగా సంగిశెట్టి అశోక్ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ కాకినాడ నగర అధ్యకుడిగా ఉన్న సంగిశెట్టి అశోక్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

Sangishetty Ashok - Thota Sudhir
Janasena Thota Sudhir : జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా తోట సుధీర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన తోట సుధీర్ కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. తోట సుధీర్ కు నియామక పత్రాన్ని పవన్ కల్యాణ్ శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందచేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్ళే బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. ఎప్పుడూ జన సైనికులకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని స్పష్టం చేశారు. అనంతరం తోట సుధీర్ మాట్లాడుతూ తనపై పవన్ కల్యాణ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటానని తెలిపారు.
Nagul Meera : సజ్జల రామకృష్ణారెడ్డి నేరస్థులను కాపాడుతున్నారు.. నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు
జనసేన రాష్ట్ర కార్యదర్శిగా సంగిశెట్టి అశోక్ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ కాకినాడ నగర అధ్యకుడిగా ఉన్న సంగిశెట్టి అశోక్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అశోక్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా పగడాల శివపార్వతి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పగడాల శివపార్వతిని నియమించారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్.. ఆమెకు నియామక పత్రాన్ని అందచేశారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన శివపార్వతి పార్టీ వీర మహిళ విభాగంలో చురుగ్గా పని చేస్తున్నారు. తనకు అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తరపున బలంగా గళాన్ని వినిపిస్తానని ఆమె పేర్కొన్నారు.
కాకినాడ నగర అధ్యక్షుడిగా శ్రీ తోట సుధీర్
• రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ సంగిశెట్టి అశోక్
• రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల @Sivaparvathijsp గారు #HelloAP_ByeByeYCP #PawanKalyan pic.twitter.com/P2Havd4bnF
— Pawan Kalyan Youth Force (@TeamPKYF) July 8, 2023