సందడే సందడి : సంక్రాంతి శుభాకాంక్షలు

  • Published By: madhu ,Published On : January 15, 2020 / 01:40 AM IST
సందడే సందడి : సంక్రాంతి శుభాకాంక్షలు

Updated On : January 15, 2020 / 1:40 AM IST

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపేడే విధంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లన్నీ కలర్‌ఫుల్‌గా మారాయి. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి పండుగ.. తర్వాత సంక్రాంతి..మరుసటి రోజు కనుమ. సంక్రాంతి రోజు సూర్యుడు ధనుర్‌ రాశిలోంచి మకర రాశి లోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగకు మకర సంక్రాంతి అని కూడా పేరు.

సంక్రాంతి సందడి అంబరాన్ని తాకుతోంది. కోడిపందాలతో పాటు గుండాట, పేకాట, కెసినో గేమ్స్‌తో కోడి పందాల శిబిరాల కళకళలాడుతున్నాయి. పెద్దపెద్ద టెంట్లు వేసి పార్కింగ్‌ ఏర్పాట్లు చేసి మరీ పగలు, రాత్రి అనే తేడా లేకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వీటిని వేసేందుకు, చూసేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివచ్చారు. సామాన్య ప్రజలే కాకుండా… పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పందాలకు తరలివస్తున్నారు.

కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. చిన్నచిన్న బరుల్లో వేలల్లో సాగుతుంటే పెద్దలు పాల్గొంటున్న చోట మాత్రం లక్షల్లో పందాలు కాస్తున్నారు. పందెం బాబులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సినీహీరో శ్రీకాంత్, యాక్టర్‌ సమీర్‌ కలిసి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండల సింగవరంలో కోడిపందాలను వీక్షించారు.

నర్సాపురంలో ఏర్పాటు చేసిన కోడి పందాల బరిలో జబర్దస్త్‌ టీమ్‌ సందడి చేసింది. కోడి పందాలు చూసేందుకు వచ్చినవారు.. జబర్దస్త్ టీమ్‌ మెంబర్స్‌తో సభ్యులతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. సంక్రాంతి సంబరాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డ్యాన్స్‌ చేశారు. బుట్టాయిగూడెం దగ్గర పండుగ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే… విద్యార్థులు, అధికారులతో కలిసి ఉత్సాహంగా చిందేశారు.

Read More : పోలింగ్ జరగలేదు..ఫలితాలు రాలేదు..TRSలో ఫుల్ జోష్