ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి 6రోజుల సెలవులు

Pongal Holidays: ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను కన్ఫామ్ చేసింది గవర్నమెంట్. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన చేసింది విద్యాశాఖ. జనవరి 12నుంచి 17వరకూ మొత్తం 6రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవులతో పాటు మరో రెండు రోజులు కలిసిరానున్నాయి.
9న రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమం ఉండటంతో విద్యా శాఖ తప్పనిసరిగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది.
జనవరిలో బ్యాంకు హాలీడే వివరాలు:
జనవరి 14 (గురువారం)- మకర సంక్రాంతి
జనవరి 26 (మంగళవారం)- రిపబ్లిక్ డే