Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులపై స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP GOVT
Sankranti holidays : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సెలవులపై స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 12 నుంచి 17 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
అయితే మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. సవరించిన ఉత్తర్వుల ప్రకారం సెలవులను ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
Sankranti TSRTC Buses : సంక్రాంతికి అదనంగా మరో 4,233 బస్సులు… సాధారణ ఛార్జీలే వసూలు
ఈ నెల 17న ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు సవరించిన సెలవుల షెడ్యూల్ జాబితాను అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పంపించారు.