Sathya Sai : పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు.. 9.2కిలోల బంగారంతో విగ్రహం.. విశేషాలు ఇవే..
Sathya Sai : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
Sathya Sai
Sathya Sai : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రముఖ సినీ నటి ఐశ్వర్యారాయ్, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తోపాటు పలువురు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంకు చేరుకున్న మోదీ.. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

Sathya Sai gold Statue
9.2 కిలోల బంగారు విగ్రహం..
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 9.2 కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి విగ్రహాన్ని రూపుదిద్దారు. ఈ ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల ఎత్తయిన వెండి రథంలో ప్రతిష్టించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండి, కిలో బంగారాన్ని పూతగా వినియోగించారు.
సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ..
సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సచిన్ టెండూల్కర్ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారు. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి కృషి చేశారని అన్నారు. ప్రజలను జడ్జ్ చేయొద్దని.. వారిని అర్థం చేసుకోవాలని చెప్పేవారని, దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. 2011 వరల్డ్ కప్‌లో నేను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి.. అప్పుడు బెంగళూరులో ఉన్నాం. సత్య సాయిబాబా ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకం పంపారు. అది నాకు సానుకూల దృక్పథాన్ని, స్పూర్తిని ఇచ్చింది. ఆ సంవత్సరం మేము ట్రోఫీ కూడా గెలుచుకున్నామని. అది నాకు గోల్డ్ మూమెంట్ అని సంచిన్ పేర్కొన్నారు.
