సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

  • Published By: bheemraj ,Published On : July 21, 2020 / 11:21 PM IST
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

Updated On : July 22, 2020 / 6:41 AM IST

కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ విద్య ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన టీచర్ల నియామకాన్ని చేపట్టాలని సూచించారు. స్కూళ్ల పక్కనే అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పోటీ పరీక్షలపై శిక్షణ ఇప్పించాలని సూచించారు.

హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం లాగా ఏపీ ఒక విద్య విప్లవంగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ లో విద్య రంగంలో సమూలంగా మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ విద్యా రంగంపై సమీక్ష నిర్వహించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం నుంచే ఎల్ కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చిన్నప్పటి నుంచే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ కేజీ, యూకేజీ ఈ సంవత్సరమే ప్రాంభించబోతున్నారు.

అన్ని ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధించేందుకు పాఠ్యంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రింట్ చేశారు. విద్యకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుంది.