Dead Body Moved On Bike : పాముకాటుతో బాలుడు మృతి.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరణ.. బైక్‌పై గ్రామానికి తీసుకెళ్లిన తండ్రి
తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పాము కాటుతో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బైక్ పై తండ్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరించడంతో బాలుడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు.

BOY DIED
Dead Body Moved On Bike : తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పాము కాటుతో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బైక్ పై తండ్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరించడంతో బాలుడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు. ఈ ఘటన కేవీబీపురం మండలం దిగువపుత్తూరులో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. దిగువపుత్తూరులో నివాసముండే చెంచయ్య అనే వ్యక్తికి బసవయ్య (7) అనే కుమారుడు ఉన్నాడు.
బాలుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా నాగుపాము బాలుడిని కాటేసింది. దీంతో నురగలు కక్కుతూ కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వాళ్లు బాలుడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Snake Bite : పాము కాటుకు అక్కాతమ్ముడు బలి
విషయం తెలిసి తండ్రి చెంచయ్య ఆస్పత్రికి చేరుకుని, కన్నీరుమున్నీరుగా విలపించారు. బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లబోయాడు. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒక్క ప్రైవేటు వాహనం కూడా ముందుకురాలేదు. దీంతో గుండెను బండ చేసుకొని పరిచయస్తుల దగ్గర తీసుకున్న బైక్‌పైనే తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ దృశ్యం చూసిన చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రైవేటు వాహనదారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.