ఏకగ్రీవ ఎన్నిక : ఏపీ మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్

విజయవాడ : ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎం.ఎ. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఇతర నేతలు ఆయన్ను అభినందించి ఛైర్మన్ స్థానం వద్దకు తొడ్కొని వెళ్లగా.. షరీఫ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు షరీఫ్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఫరూక్‌ని మంత్రిగా, షరీఫ్‌ను మండలి ఛైర్మన్‌గా చేయటం ద్వారా మైనార్టీలకు రెండు ముఖ్య పదవులు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనమండలి గౌరవం నిలబెడతానని షరీఫ్ చెప్పారు.