Shining AP: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది.. 10టీవీలో ఎక్స్‌క్లూజివ్ కవరేజ్.. ఉదయం 9 గంటల నుంచి..
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది.

Shining AP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు అనేక విధానాలు తీసుకొచ్చారు. ప్రజల కోసం మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది సందర్భంగా 10టీవీలో ఎక్స్ క్లూజివ్ కవరేజ్.. షైనింగ్ ఏపీ.. ఉదయం 9 గంటల నుంచి..
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 175 సీట్లలో 164 సీట్లతో ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చింది మొదలు “సూపర్ సిక్స్” హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పలు కీలక సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. కేంద్రం సాకారంతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు వంటి హామీలను నెరవేర్చింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గత ప్రభుత్వం విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని పునర్ నిర్మించి.. అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామంది.
ఏపీకి జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కార్. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. స్వయంగా వెళ్లి పనులను పరిశీలిస్తున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అలాగే అమరాతికి పెట్టుబడులు తెచ్చేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. అమరావతిలో ఇన్వెస్ట్ మెంట్ చేయాలని సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిస్తున్నారు.
తనకున్న బలంతో కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి ఉన్నప్పటికీ.. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో ఏపీలోని కూటమి ప్రభుత్వం సయోధ్యతో వెళ్తోంది. మోదీ సర్కార్ తో చంద్రబాబు సఖ్యతగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు, ప్రాజెక్టులు సాధించడమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు కేంద్రంతో మంచి సంబంధాలు నెరుపుతున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని విభాగాల్లో కొలువుల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఏపీలో మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రానున్న రోజల్లో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కొలువులు భర్తీ చేయనుంది.
కూటమిలో అన్ని పార్టీలకు సముచిత గౌరవం ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పదవులు సహా అన్ని అంశాల్లో టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరిని కలుపుకుని ముందుకు సాగుతున్నారు. ఎక్కడా ఆధిప్యత ధోరణి ప్రదర్శించకుండా కలుపుగోలుగా ముందుకెళ్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఏ అంశం అయినా కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు. అందరూ చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎక్కడా సమాచారం లోపం, సమన్వయ లోపం లేకుండా కూటమి నాయకులు ముందుకు సాగుతున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూరి చేసుకుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది సందర్భంగా.. షైనింగ్ ఏపీ..ఉదయం 9 గంటల నుంచి.. 10టీవీలో చూడండి..