JanaSena: పవన్ కల్యాణ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తారా?: జగన్‌పై జనసేన ఆగ్రహం

మీ ఇళ్లలో రెండు పెళ్లిళ్లు అవ్వలేదా? మీ కుటుంబంలో తగవులు లేవా? అని అన్నారు.

JanaSena: పవన్ కల్యాణ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేస్తారా?: జగన్‌పై జనసేన ఆగ్రహం

Panchakarla Ramesh Babu, Shiva Shankar

Updated On : October 12, 2023 / 8:15 PM IST

Ramesh Babu-Shiva Shankar: సీఎం జగన్‌పై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ… పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వ కార్యక్రమంలో జగన్ వాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. ఏ ముఖ్యమంత్రీ ఇలా మాట్లాడబోరని అన్నారు. ముఖ్యమంత్రి హోదాను మరిచి జగన్ దిగజారి మాట్లడతున్నారని విమర్శించారు.

పొంతనలేని మాటలు మాట్లాడుతూ రాష్ట్ర పతిష్ఠను దిగజార్చుతున్నారని శివశంకర్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో సర్కారు పథకాల గురించి చెప్పాలని, అంతేగానీ పవన్ గురించి నీతిమాలిన మాటలు మాట్లాడడం ఏంటని నిలదీశారు. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత వైసీపీ గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే పంచరకర్ల రమేశ్ బాబు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి మాటలు చూస్తే అసహ్యం వేస్తోందని చెప్పారు. అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమిలేకే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. కులాల గురించి ముఖ్యమంత్రి హోదాలో అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. మీ ఇళ్లలో రెండు పెళ్లిళ్లు అవ్వలేదా? మీ కుటుంబంలో తగవులు లేవా? అని అన్నారు.

Chandrababu : జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు