Chittoor : ఇదేందయ్యా ఇది.. పోలీసులకే షాక్..! ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచి రక్షక్ వాహనం చోరీ
Chittoor : వెంటనే తేరుకుని తమిళనాడు పోలీసులను అలర్ట్ చేశారు. చివరికి వేలూరు వందవాసి వద్ద పట్టుకున్నారు.

Chittoor - Police Vehicle Theft
Chittoor – Police Vehicle Theft : పోలీసులకే షాక్ ఇచ్చాడో దొంగ. ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచి రక్షక్ వాహనాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరులో పోలీసు రక్షక్ వాహనం చోరీకి గురైంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి రక్షక్ వాహనాన్ని ఎత్తుకెళ్లాడు ఓ దొంగ.
వాహనాన్ని చెన్నై వరకు తీసుకెళ్లాడు. స్టేషన్ నుంచి వాహనం చోరీకి గురి కావడంతో షాక్ కి గురయ్యారు పోలీసులు. ఆ వెంటనే తేరుకుని తమిళనాడు పోలీసులను అలర్ట్ చేశారు. చివరికి వేలూరు వందవాసి వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. దొంగకు మతిస్థిమితం లేనట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా, వాహనం చోరీకి గురైన మూడు గంటల్లో దొంగను పట్టుకున్నారు పోలీసులు.
పోలీసు రక్షక్ వాహనం చోరీకి గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసు వాహనాలకు అందులోనూ పోలీస్ స్టేషన్ లోనే రక్షణ లేకపోతే ఇక, సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు అడుగుతున్నారు.