Indigo Plane : ఇండిగో తీరుపై సింగర్ ‘వీణా శ్రీవాణి’ ఆగ్రహం

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోపై గాయని వీణా శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ లగేజీని తీసుకురావడంలో ఇండిగో అలసత్వంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారామె

Indigo Plane : ఇండిగో తీరుపై సింగర్ ‘వీణా శ్రీవాణి’ ఆగ్రహం

Indigo Plane

Updated On : December 19, 2021 / 5:15 PM IST

Indigo Plane : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తీరుపై గాయని వీణా శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. షో నిమిత్తం తన బృందంతో కలిసి రాజమండ్రి వెళ్లారు శ్రీవాణి.. వారు గమ్యానికి వెళ్లినా వారి లగేజీ రాకపోవడంతో ఆమె ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే లగేజీ తెచుకున్నప్పటికీ.. అది మోతాదుకు మించి ఉందంటూ తమ వద్ద నుంచి కొంత డబ్బు వసూలు చేశారని.. తీరా గమ్యస్థానానికి చేరుకున్నాక.. లగేజీ ఇంకా తమ వద్దకు రాలేదని అన్నారు.

చదవండి : Pushpa : అసలు మజా పార్ట్ 2లో ఉంది : సుకుమార్

ఇండోగో సిబ్బందిని అడిగితే.. తాము ప్రయాణించిన విమానంలో ఖాళీ లేదని.. వేరే విమానంలో తీసుకొస్తున్నట్లు చెప్పారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఇండిగో అధికారులతో మాట్లాడుతూ తన షో ఆలస్యమైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వేరే విమానంలో తీసుకొచ్చేటట్లైతే ప్రయాణం ప్రారంభమైన వెంటనే తమకు సమాచారం ఇవ్వొచ్చుకదా అంటూ ప్రశ్నించారమే.

చదవండి : KGFChapter2: కేజీఎఫ్-2 రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్