Tragedy : కన్నతండ్రి ఎదుటే వాగులో కొట్టుకుపోయి అక్కాతమ్ముడు మృతి
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు.

Dead
sister and brother died : కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాగులో కొట్టుకుపోయిన అక్కాతమ్ముడు మృతి చెందారు. కన్నతండ్రి ఎదుటే పిల్లలు గల్లంతై, మృతి చెందారు. తండ్రితోపాటు అక్కాతమ్ముడు ఓ శుభకార్యానికి వెళ్తూ వాగు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ముగ్గురు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు అక్కాతమ్ముడు వాగులో పడిపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు మృతి చెందారు. మృతులు షాజియా (16), జాసీర్ (11) చాకిబండ వాసులుగా గుర్తించారు.
Love Couple Suicide : పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
వీరి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు బోరున విలపిస్తున్నారు.